HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ntr Statue To Be Erected In Andhra Pradeshs Amaravati On The Lines Of Gujarats Statue Of Unity

NTR Statue: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’లా అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం

ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(NTR Statue) పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

  • Author : Pasha Date : 23-04-2025 - 1:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr Statue Andhra Pradesh Amaravati Gujarat Statue Of Unity Sardar Vallabhbhai Patel

NTR Statue:  నందమూరి తారక రామారావు.. యావత్ తెలుగుజాతి గర్వించే మహానేత. ఆయనను రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరు చాలా ఇష్టపడతారు. భౌతికంగా ఎన్‌టీఆర్ ఈ లోకంలో లేనప్పటికీ.. ఆయన ఆశయాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. ఎన్‌టీఆర్ నటించిన ఆణిముత్యాల లాంటి సినిమాలను నేటికీ తెలుగు ప్రజానీకం కళ్లారా చూస్తున్నారు. దేవుడి పాత్రల్లో ఎన్‌టీఆర్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. యుగ పురుషుడిలా నిలిచిన ఎన్‌టీఆర్ తెలుగు జాతి కీర్తిని యావత్ దేశంలో చాటిచెప్పారు. తెలుగువాళ్లుగా మనమంతా గర్వించేలా చేశారు. అందుకే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేసే దిశగా ఏపీలోని కూటమి సర్కారు అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే అన్న ఎన్‌టీఆర్ అత్యంత భారీ విగ్రహాన్ని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని సంకల్పించింది.

Also Read :Sathya Sai Centenary: పుట్టపర్తి సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం

ఏడీఆర్ తయారీకి సన్నాహాలు 

ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(NTR Statue) పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అచ్చం అదే తరహాలో ప్రజల మనిషి ఎన్‌టీఆర్ భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు.  అమరావతిలోని రాజధాని ప్రధాన ప్రాంతంలో ఉన్న నీరుకొండలో ఈ విగ్రహాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ విగ్రహం నిర్మాణానికి సంబంధించిన వివరాలతో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)‌ను తయారు చేసేందుకు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) టెండర్లను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న సంస్థలు టెండర్లు వేయొచ్చు. డీపీఆర్‌ను తయారు చేసి సమర్పించొచ్చు. నీరుకొండలో నిర్మించనున్న ఎన్‌టీఆర్ భారీ విగ్రహం మోడల్ ఎలా ఉంటుందనే దానిపై  కొన్ని ఊహాచిత్రాలను ఇప్పటికే అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విడుదల చేసింది.

Also Read :Terrorist Attacks : కశ్మీరులో ఉగ్రదాడి.. పాక్ ఆర్మీ చీఫ్ కుట్ర.. కారణం అదే !

క్రికెట్ స్టేడియం కూడా.. 

గుజరాత్‌లో నర్మదా నది ఒడ్డున సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ఉంది. దాన్నే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. ఈ విగ్రహం సమీపంలో.. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంను నిర్మించారు. అమరావతిలోనూ అదే తరహాలో ఎన్‌టీఆర్ భారీ విగ్రహం, క్రికెట్ స్టేడియం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అమరావతిలో సీఎం అధికారిక నివాసం, ఇతర కీలక ప్రభుత్వ భవనాలను కలుపుతూ 6 కిలోమీటర్ల పొడవైన రోడ్డు రాబోతుంది. 6 కిలోమీటర్ల పొడవైన కోర్ క్యాపిటల్ ఎండింగ్ పాయింట్‌గా నీరుకొండ ఉంది. దానిపైనే ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించబోతున్నారు. అమరావతికి ముఖ్యమైన అట్రాక్షన్ గా  ఎన్టీఆర్ విగ్రహం ఉండబోతోంది. ఇటీవలే ఏపీ మంత్రి నారాయణ బృందం గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని చూసి వచ్చారు. తద్వారా ఎన్‌టీఆర్ విగ్రహం రూపకల్పనపై క్లారిటీకి వచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • gujarat
  • ntr statue
  • Sardar Vallabhbhai Patel
  • Statue of Unity

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd