I Am With CBN : హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో దీక్ష చేపట్టిన నందమూరి, నారా కుటుంబసభ్యులు
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా గాంధీ జయంతి నాడు టీడీపీ
- By Prasad Published Date - 04:44 PM, Mon - 2 October 23

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా గాంధీ జయంతి నాడు టీడీపీ అగ్రనేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కార్యకర్తలు దీక్షలు చేస్తున్నారు. రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు మద్దతుగా తెలుగుతముళ్లు దీక్ష చేపట్టారు. ఇటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ కూడా దీక్ష చేపట్టారు. తెలంగాణలో టీడీపీ నేతలు కూడా దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు దీక్ష చేపట్టారు. దీక్షకు నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి, ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్, తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి, తారకరత్న పిల్లలు, నారా రోహిత్ తల్లి ఇందిర, నందమూరి జయశ్రీ, చలసాని చాముండేశ్వరి తదితరులు చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో జరుగుతున్న ఈ నిరాహార దీక్షలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.