HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ntr Bharosa Pension New Rule

NTR Bharosa Pension : పింఛన్ల విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు

NTR Bharosa Pension : ఇప్పటి వరకు కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లకుండా, ఒకే చోట కూర్చుని పింఛన్ పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి

  • Author : Sudheer Date : 13-02-2025 - 7:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu Naidu Brings
Cm Chandrababu Naidu Brings

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ (NTR Bharosa Pension Scheme) ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థంగా మార్చేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) పింఛన్ల పంపిణీలో అనుసరించాల్సిన నియమాలను మరింత కఠినతరం చేశారు. ఈ మార్పుల ద్వారా లబ్ధిదారులకు సరైన సమయంలో, వారి నివాసం వద్దే పింఛన్ అందేలా చర్యలు తీసుకున్నారు.

ఇప్పటి వరకు కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లకుండా, ఒకే చోట కూర్చుని పింఛన్ పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది లబ్ధిదారులు ఇతర గ్రామాల్లో ఉంటూ అక్కడే పింఛన్ తీసుకుంటున్నారని గుర్తించారు. దీంతో ఇకపై ప్రతి లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి పింఛన్ అందించాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు 50 ఇళ్ల పరిధిలో పింఛన్లను పంపిణీ చేసేవారు. అయితే ప్రస్తుతం, ముగ్గురు వాలంటీర్ల పరిధిలోని లబ్ధిదారులను ఒక క్లస్టర్‌గా చేసి, గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ప్రతి క్లస్టర్‌లో 60 నుంచి 120 మంది వరకు లబ్ధిదారులు ఉంటున్నారు. అయితే ఈ విధానం కొంత భారంగా ఉన్నప్పటికీ, గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగ్గా అమలవుతోందని అధికార వర్గాలు అంటున్నాయి.

Pawan Kalyan: తిరువల్లం శ్రీ పరుశురాముని సేవలో పవన్ కళ్యాణ్

సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం సర్వే చేయించింది. ఈ సర్వేలో లబ్ధిదారుల ఇంటి జియో కోఆర్డినేట్స్‌ను నమోదు చేసి, ఆ ఇంటికే వెళ్లి పింఛన్ అందించేలా యాప్‌లో మార్పులు చేశారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుడి ఇంటి వద్ద కాకుండా మరోచోట పింఛన్ పంపిణీ చేస్తే, యాప్‌లో ఆ వివరాలు నమోదవుతాయి. అదే జరిగితే సంబంధిత ఉద్యోగి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు తరచుగా వేరే చోట పింఛన్లు తీసుకుంటున్న వారి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనారోగ్య సమస్యల వల్ల ఆసుపత్రుల్లో ఉన్నవారు, ఇతర ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న వారు ముందుగా తమ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు అమలులోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీ మరింత క్రమబద్ధమైనదిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • new rules regarding pensions
  • NTR Bharosa Pension

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd