Ramamurthy Naidu : ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు పెద్ద తప్పు చేసారా..?
Ramamurthy Naidu Dies : ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇంతవరకు కనీసం స్పందించలేదు.. అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. కావాలని చేయలేదా? లేకపోతే మనకెందుకులే అని వదిలేశారా...?
- By Sudheer Published Date - 07:42 PM, Mon - 18 November 24

జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ (NTR , Kalyan Ram) లు పెద్ద తప్పు చేసారా..? అంటే అవుననే అంటున్నారు సినీ అభిమానులు , టీడీపీ శ్రేణులు. ఎంత శత్రువైన ఆపదలో ఉన్న సమయంలో వారిని పరామర్శించడం , మాట్లాడడం, వారి దగ్గరికి వెళ్లడం అనేది సంస్కారం. ముఖ్యంగా ఎవరైనా దగ్గరి బంధువులు కానీ , నా అనుకున్న వారు మరణిస్తే ఆ కుటుంబానికి కాస్త భరోసా ఇవ్వడం ఎవరైనా చేస్తారు. అయితే మొన్న చంద్రబాబు సోదరుడు నారా రాంమూర్తి నాయుడు (Ramamurthy Naidu Dies) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈయన మరణం నారా ఫ్యామిలీ (Nara Family) తో పాటు నందమూరి ఫ్యామిలీ (Nandhamuri Family), టీడీపీ శ్రేణుల్లో విషాదం నింపింది. రాంమూర్తి నాయుడు మరణ వార్త తెలిసి ప్రతి ఒక్కరు స్పందిస్తూ వారి కుటుంబ సబ్యులకు ధైర్యం నింపే ప్రయత్నం చేసారు. ఇక చంద్రబాబు , లోకేష్ అయితే తమ కార్యక్రమాలన్నింటిని పక్కన పెట్టి అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు ఉన్నారు. ఇక చంద్రబాబు అయితే సోదరుడి మరణ వార్త తో కుంగిపోయారు. అంత్యక్రియల్లో పాల్గొనడమే కాదు స్వయంగా పాడెను సైతం మోశారు. ఇటు చిత్ర సినిమా నుండే కాక రాజకీయేతర పార్టీల నేతలు సైతం రాంమూర్తి నాయుడికి సంతాపం తెలిపారు. అయితే ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు మాత్రం రాంమూర్తి నాయుడు మరణం పై స్పందించకపోవడం పై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇంతవరకు కనీసం స్పందించలేదు.. అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. కావాలని చేయలేదా? లేకపోతే మనకెందుకులే అని వదిలేశారా…? పరిశ్రమలో తనకు సన్నిహితంగా ఉండేవారికి తరుచుగా ట్వీట్ చేసే ఎన్టీఆర్ తన బంధువు మరణిస్తే ఎందుకు ట్వీట్ చేయలేదు? ఎందుకు మృతదేహానికి నివాళులు అర్పించలేదు? ఎందుకు వారి కుటుంబ సభ్యులను కలవలేదు? అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి వీరి మౌనం వెనుక కారణాలు ఏంటి అనేది తెలియాలి ఉంది. ఒకవేళ హాస్పటల్ లో ఉన్నప్పుడే చూసారా అంటే దానికి సంబంధించి పిక్ అయినా బయటకు వచ్చేది కదా..అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ విషయంలో మాత్రం ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ పెద్ద తప్పు చేసారని వారి అభిమానులు కూడా మాట్లాడుకుంటున్నారు.
Read Also : RCB Bowling Coach: ఆర్సీబీకి కొత్త బౌలింగ్ కోచ్.. ఎవరీ ఓంకార్ సాల్వి?