NSG Report to Central : కమాండోలపై జగన్ కన్ను! చంద్రబాబుకు NSG భద్రత తొలగింపు?
NSG Report to Central : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడుకి ఎస్పీజీ భద్రత కొనసాగుతోంది.
- Author : CS Rao
Date : 15-09-2023 - 3:20 IST
Published By : Hashtagu Telugu Desk
NSG Report to Central : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడుకి ఎస్పీజీ భద్రత కొనసాగుతోంది. ఆ భద్రతను అవసరంలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు, మార్గదర్శకాల ప్రకారం ఎస్పీజీని జైలులోకి ప్రవేశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న జడ్ ప్లస్ భద్రతను సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందుకే, ఎస్పీజీని పర్యవేక్షించే ఉన్నతాధికారులు ప్రత్యేక నివేదికను కేంద్ర హోంశాఖకు పంపినట్టు సమాచారం.
చంద్రబాబుకు ఉన్న జడ్ ప్లస్ భద్రతను సమీక్షించడానికి ..(NSG Report to Central)
దేశంలోని ప్రముఖులకు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంటుంది. పైగా జడ్ ప్లస్ కేటగిరి కొందరికి మాత్రమే కల్పిస్తారు. ఉగ్రవాద, మావోయిస్ట్ హిట్ లిస్ట్ లో ఉన్న వాళ్లకు జడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పిస్తారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖ తదితర వీవీఐపీలకు ప్రత్యేక భద్రతను ఇస్తారు. ఆ తరహా భద్రత ఇంచుమించుగా చంద్రబాబుకు ఉంది. ఆయన భద్రతను స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి సమీక్షించారు. ఆ సమయంలో హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి హడావుడి చేశారు. దీంతో జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను (NSG Report to Central) సమీక్షించే ఆలోచన నుంచి అప్పట్లో విరమించుకున్నారు.
చంద్రబాబు హత్యకు కుట్ర పన్నారని
జడ్ ప్లస్ భద్రతలో భాగంగా 4+4 కమెండోల భద్రత ఉండేది. ఒక వేళ ఆయన ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు రాష్ట్ర పోలీస్ ఎస్కార్ట్ ఉండాలి. పైలెట్ వెహికల్ ను ఇవ్వాలి. కానీ, సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత పైలెట్ వెహికల్ రూపంలో ఇచ్చే ఎస్కార్ట్ వాహనాన్ని కొన్ని సందర్భాల్లో ఇవ్వకుండా తప్పించారు. ఆ విషయంలో కేంద్ర ఆధీనంలోని ఎస్పీజీ విభాగం సమీక్షించింది. ఆ తరువాత ఎస్కార్ట్ వాహనంతో పాటు సిబ్బందని రాష్ట్ర పోలీస్ విభాగం కల్పిస్తుంది. ఇటీవల కుప్పం వెళ్లిన సందర్భంగా చంద్రబాబు మీద వైసీపీ క్యాడర్ రాళ్ల వర్షం కురిపించింది. ఆ సందర్భంగా కామెండోలకు స్వల్ప గాయాలు అయ్యాయి. చంద్రబాబు హత్యకు కుట్ర పన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సంఘటన తాలూకూ వివరాలను కమాండోలు తెలియచేయడంతో చంద్రబాబు 6+6 కామెండోలను ఇచ్చారు. కేంద్రం ఆయన (NSG Report to Central) భద్రతను పెంచింది.
ఎస్పీజీ చీఫ్ తో అనుమతి తీసుకున్న తరువాత చంద్రబాబును అరెస్ట్ (NSG Report to Union Home Ministry)
కమెండోలను ఒక స్టేటస్ కింద చంద్రబాబు భావిస్తున్నారని వైసీపీ వర్గాల్లో ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు ఉన్న భద్రత మీద పలుమార్లు పోలీస్ వద్ద ప్రస్తావించారట. ఆ క్రమంలోనే పైలెట్ వాహనాన్ని పంపకుండా కొన్ని జిల్లాల్లోని ఎస్పీలు వ్యవహరించారని టీడీపీ పలుమార్లు ఆరోపించింది. అంతేకాదు, కమాండోలు ఉన్న కారణంగా చంద్రబాబును ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఎస్పీజీ భద్రత ఉన్నప్పటికీ ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఎస్పీజీ చీఫ్ తో అనుమతి తీసుకున్న తరువాత చంద్రబాబును అరెస్ట్ చేశారు. అంటే, కేంద్ర హోంశాఖకు తెలియకుండా (NSG Report to Central) చంద్రబాబు అరెస్ట్ జరగలేదని ఎవరికైనా అర్థం అవుతుంది.
Also Read : Security In India: Z ప్లస్ సెక్యూరిటీ అంటే ఏమిటి..? ప్రధానమంత్రికి భద్రత ఇచ్చేది ఎవరు..?
ప్రస్తుతం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు భద్రతను రివ్యూ చేస్తున్నారు. ఆ మేరకు ఎస్పీజీ ఒక వేదికను కేంద్ర హోంశాఖకు పంపినట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా నడిచిన ఎపిసోడ్ ను పేపర్ మీద పెట్టి లోకల్ కమాండోల ఇంచార్జి అందచేశారని సమాచారం. ఈనెల 8వ తేదీన అర్థరాత్రి ఏపీ సీఐడీ పోలీస్ నంద్యాల వచ్చినప్పటి నుంచి జరిగిన పరిణామాలను పేపర్ మీద పెట్టారట. ఆయన్ను 9వ తేదీ ఉదయం వేకువజామున తరలించడం, సాయంత్రం వరకు రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తీసుకెళ్లడాన్ని వివరించారని తెలిసింది. ఆ తరువాత ఆయన్ను 10వ తేదీ కోర్టులో ప్రవేశ పెట్టడం, ఆ రోజు అర్థరాత్రి దాటిని తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన తీరును కళ్లకు కట్టినట్టు పేపర్ మీద డ్రాప్ట్ చేశారని తెలిసింది. అయితే, ప్రస్తుతం కమాండోలు జైలు బయట ఉన్న విషయాన్ని తెలియచేస్తూ, చంద్రబాబు భద్రత గురించి కొన్ని సందేహాలను పొందుపరుస్తూ ఎస్పీజీ చీఫ్ కు నివేదికను పంపారని సమాచారం.
Also Read : Hyderabad: చంద్రబాబు మద్దతుదారులకు హైదరాబాద్ డీసీపీ వార్నింగ్
జైలులో చంద్రబాబు భదత్ర మీద టీడీపీ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ములాఖత్ కు వెళ్లిన భువనేశ్వరి కూడా చంద్రబాబు భద్రత మీద ఆందోళన చెందారు. స్నేహ బ్లాక్ లోని పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోన్న భద్రత, సౌకర్యాలు తదితరాలను ఎస్పీజీ చీఫ్ కు పంపారని వినికిడి. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న చంద్రబాబు భద్రతపై ఆయన కుంటుంబ సభ్యులతో పాటు కమాండోలు కూడా అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మేరకు నివేదికను పంపారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధంగా కమాండోల భద్రతను తొలిగిస్తారా? ఎస్పీజీ ఇచ్చిన నివేదిక ప్రకారం భద్రతను కొనసాగిస్తారా? అనేది ఆసక్తికర అంశం.