HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Notices To Srm University Hearing On 24th Of This Month

SRM University : SRM యూనివర్శిటీకి నోటీసులు..ఈ నెల 24న విచారణ!

  • Author : Vamsi Chowdary Korata Date : 21-11-2025 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srm
Srm

అమరావతి SRM యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్ బకాయిలున్నాయని ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉండగా, ఇటీవల హాస్టల్‌లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని విచారణ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని SRM యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు ఇచ్చింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్‌ సెస్‌ పెండింగ్‌ ఉన్నాయి.. అయితే SRM యూనివర్శిటీ లేబర్‌ సెస్‌ చెల్లించడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఈ నెల 24న విచారణకు రావాలంటూ SRM వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌కు కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీలో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్ కూడా చెల్లించడం లేదని ఆరోపణలు ఉన్నాయట. కార్మికశాఖ SRM యూనివర్శిటీకి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

అమరావతిలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ హాస్టల్‌లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. ఆ వెంటనే విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు.ఈ ఘటనతో విద్యార్థులు ఆరోగ్యంపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు కూడా యూనివర్సిటీకి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆందోళనలకు అసలు కారణాలను తెలుసుకోవడానికి, ప్రభుత్వం ఒక అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. తెనాలి సబ్ కలెక్టర్ అంజనా సిన్హా ఆధ్వర్యంలో ఆరుగురు అధికారులతో ఈ కమిటీని నియమించారు.

ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 300 మందికి పైగా విద్యార్థులు డయేరియాతో బాధపడుతున్నారని గుర్తించింది. ఈ నేపథ్యంలో, కమిటీ పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల నుంచి వివరాలు సేకరించింది. ఫుడ్, వాటర్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. నీటి శుద్ధి ప్రక్రియపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతోనూ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో యూనివర్సిటీ అధికారులు ఈ నెల 7 నుంచి 23 వరకు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, యూనివర్సిటీ మొత్తం శానిటేషన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హాస్టల్, మెస్, తరగతి గదుల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఈ పరిణామాల తర్వాత వర్శిటీకి కార్మికశాఖ నుంచి నోటీసులు వచ్చాయి.. ఈ అంశంపై వర్శిటీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • Labour Department Commission Notice
  • srm university

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd