HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >No Regrets For Not Getting Rs Seat Ali

Ali: రాజ్యసభ ఆటలో ‘అలీ’

ప్రముఖ తెలుగు హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ అలీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సీటు దక్కుతుందని భావించాడు.

  • Author : Balu J Date : 18-05-2022 - 5:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ali
Ali

ప్రముఖ తెలుగు హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ అలీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సీటు దక్కుతుందని భావించాడు. తుది జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశకు గురి చేసినట్టయింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో అలీ మరోసారి చర్చనీయాంశమయ్యాడు. మైనార్టీ కోటా కింద అలీకి రాజ్య సభ సీటు కచ్చితంగా దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పొలిటికల్ ఈక్వెషన్స్ వల్ల రాజ్యసభ రేసులో అలీ వెనుకబడినట్టు తెలుస్తోంది.

కామెడీ యాక్టర్ అలీ 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీలో చేరారు. రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయనను బరిలోకి దింపుతారని చర్చ జరిగింది. కానీ, రాజకీయ, కుల సమీకరణాల కారణంగా జగన్ ఆయనకు స్థానం కల్పించలేకపోయారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా కూడా జగన్ ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తారనే టాక్ వచ్చింది. వాస్తవానికి, రెండు నెలల క్రితం టాలీవుడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి అలీని ప్రత్యేకంగా పిలిచారు, ఆపై, అతనికి ఏదో ఒక పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ అది జరగలేదు. రాజ్య సభ సీటు కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన అలీకి నిరాశే ఎదురైందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటుపై అలీ స్పందించారు. రాజ్యసభ సీటును తాను ఆశించలేదని చెప్పారు. జగన్ దృష్టిలో తాను ఉన్నానని… తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా బాధ్యతగా నిర్వర్తిస్తానని అన్నారు. నీకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ గట్టిగా చెప్పలేదని… అయితే ఏదో ఒక పదవి ఇస్తానని మాత్రం చెప్పారని… తనకు కూడా ఆ నమ్మకం ఉందని చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ali
  • AP CM Jagan
  • comments
  • Rajya Sabha

Related News

Rajya Sabha Elections

Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ

    Latest News

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

    • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

    • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

    • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd