HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nitin Gadkari Launched The Nationwide Tree Plantation Drive At Tirupathi

Nitin Gadkari : భవిష్యత్తులో బయో ఇథనాల్ వాహనాలే.. ఇథనాల్ లీటర్ 60 రూపాయలే..

జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు(Plants) నాటే కార్యక్రమంలో నేడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పాల్గొన్నారు.

  • Author : News Desk Date : 12-07-2023 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nitin Gadkari Launched the Nationwide Tree Plantation Drive at Tirupathi
Nitin Gadkari Launched the Nationwide Tree Plantation Drive at Tirupathi

జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు(Plants) నాటే కార్యక్రమంలో నేడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పాల్గొన్నారు. ఏపీలో తిరుపతి(Tirupati) వద్ద రేణిగుంట నుండి నాయుడుపేట NH71 హైవేపై ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి చొరవతో గ్రీన్ ఇండియా మిషన్ (GIM) భాగస్వామ్యంతో జతకట్టి జాతీయ రహదారులను పర్యావరణపరంగా గ్రీన్ హైవేలుగా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రహదారి ప్రాజెక్టుల సమయంలో నరికివేయబడిన ప్రతి చెట్టుకు రెండింతలు చెట్లను ఈ ప్రాజెక్టులో భాగంగా నాటనున్నారు.

ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా రహదారులపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము. పర్యావరణ కాలుష్యానికి 40 శాతం కారణం రహదారుల శాఖనే. పెట్రోల్ వినియోగంతో పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకే ఇతర మార్గాలపై అన్వేషణ చేస్తున్నాము. ప్రత్యామ్నాయ ఇంధన వనరులయిన ఇథనాల్, మిథనాల్ వినియోగంపై దృషి పెట్టాము. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వస్తే లీటర్ పెట్రోల్ ధర 15 రూపాయలకు పడిపోతుంది. బయో ఇథనాల్ పెట్రోల్ చక్కని ప్రత్యామ్నాయం. బయో ఇథనాల్ తో నడిచే ద్విచక్ర వాహనాలను కొన్ని ప్రైవేట్ కంపెనీలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాయి. పర్యావరణ పరిరక్షణలో ఇథనాల్ సహాయపడుతుంది. పెట్రోల్ లీటర్ 110 రూపాయలు ఉండగా, ఇథనాల్ 60 రూపాయలకే లభిస్తుంది. కార్బన్ రహిత ఇంధనాలపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి అని అన్నారు.

 

ఈ కార్యక్రమంలోని ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. NHAI, PWD మరియు NHIDCLతో కలిసి దేశవ్యాప్తంగా 300,000 మొక్కలను నాటాలని ప్లాన్ చేశాము. ఈ పనిని పూర్తి చేయడానికి ఎంతోమంది వాలంటీర్లు మరియు విద్యార్థులు భాగం కానున్నారు. ఈ చొరవ వాతావరణ మార్పుల ద్వారా ఎదురయ్యే సవాళ్లకు ప్రతిస్పందనగా పనిచేస్తుంది, మొక్కల పెంపకం కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది అని తెలిపారు నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో పాటు పలువురు లోకల్ నాయకులు పాల్గొన్నారు.

 

Also Read : Aadhaar virtual ID: ఇకపై ఆధార్ లేకుండానే ఆ సేవలన్నీ పూర్తి.. ఎలా అంటే?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bio Ethanol
  • ethanol
  • Nationwide Tree Plantation Drive
  • nitin gadkari
  • tirupathi

Related News

The Centre has rejected the E25 petrol report, stating that no decision will be taken until the tests are completed.

E25 పెట్రోల్ నివేదికను కేంద్రం తిరస్కరించింది.. పరీక్షలు పూర్తయ్యే వరకు ఎటువంటి నిర్ణయం లేదని పేర్కొంది.

భారత్ E25 పెట్రోల్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోందన్న నివేదికలను కేంద్రం తోసిపుచ్చింది. అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, అధిక ఇథనాల్ మిశ్రమంపై పలు వాహన మోడళ్లలో పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది. E25 విడుదల వాదనలు “పూర్తిగా అబద్ధం” అని ప్రభుత్వ వర్గాలు న్యూస్18కి తెలిపాయి. ఏ విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు అవసరమైన విస్తృతమైన శాస్త్రీయ, సాంకేతిక మూల్యాంకనం

  • Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

    Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd