Vision-2047 : విజన్-2047కు సహకరించండి – చంద్రబాబు
Vision-2047 : శుక్రవారం అమరావతిలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీతో భేటీ అయిన సందర్భంగా ఈ విజన్‌ను వివరించారు
- By Sudheer Published Date - 06:17 PM, Fri - 7 February 25

స్వర్ణాంధ్ర విజన్ 2047 (Vision-2047)కు సహకరించాలని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ(Suman Beri)ని సీఎం చంద్రబాబు (Chandrababu) కోరారు. శుక్రవారం అమరావతిలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీతో భేటీ అయిన సందర్భంగా ఈ విజన్‌ను వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏటా 15 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.Theertha Mukkoti: ఫిబ్రవరి 12న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
“2047 నాటికి ప్రతి ఒక్కరూ 42 వేల డాలర్ల తలసరి ఆదాయాన్ని పొందే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నాం. దీని కోసం రాష్ట్రంలో అత్యుత్తమ పాలసీలు అమలు చేస్తున్నాం అని , దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అభివృద్ధిలో నీతి ఆయోగ్ మద్దతు ఎంతో కీలకమని ముఖ్యమంత్రి తెలిపారు. మీ మద్దతుతో ఇంకా వేగంగా ముందుకెళ్లగలుగుతాం. సరైన ప్రణాళికలు అమలు చేస్తే, ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి మోడల్ స్టేట్‌గా మార్చడం సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి ప్రణాళికల్లో ముఖ్యంగా పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని , ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. దీని ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించగలుగుతున్నాం అని వివరించారు. విజన్-2047 లక్ష్య సాధన కోసం ప్రభుత్వ యంత్రాంగంతో పాటు, నీతి ఆయోగ్, కేంద్ర సహకారం ఎంతో కీలకమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.