Nidigumta Aruna : మాయలేడి అరుణ బాగోతాలు తెలిస్తే..వామ్మో అనకుండా ఉండలేరు !!
Niganti Aruna : గూడూరుకు చెందిన రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అయిన ఈమె గతంలో అనేక నేరాలు, సెటిల్మెంట్లలో భాగమైనట్లు పోలీసులు గుర్తించారు
- By Sudheer Published Date - 07:31 PM, Wed - 20 August 25

నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ‘ఖిలాడీ లేడీ’ నిడిగుంట అరుణ(Nidigumta Aruna)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై నమోదైన పలు చీటింగ్ మరియు హనీట్రాప్ కేసుల విచారణలో భాగంగా పోలీసులు చాలా కాలంగా ఆమె కోసం గాలిస్తున్నారు. మంగళవారం ఆమె కారులో విజయవాడ వైపు వెళ్తుండగా, అద్దంకి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గూడూరుకు చెందిన రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అయిన ఈమె గతంలో అనేక నేరాలు, సెటిల్మెంట్లలో భాగమైనట్లు పోలీసులు గుర్తించారు. కోవూరులో ఒక ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఆమెను అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని ఓ సీఐని బెదిరించిన కేసులో కూడా ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో అరుణతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు. ఆమె చీటింగ్ కేసుల చరిత్ర చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
Sciatica : సయాటిక నొప్పి వేధిస్తుందా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు రిలీఫ్ దొరుకుతుంది
అరుణ అరెస్టుకు కొన్ని రోజుల ముందు, జీవిత ఖైదు పడిన రౌడీషీటర్ శ్రీకాంత్‌తో ఆమె ఆసుపత్రిలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరు ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్ వ్యతిరేకించినప్పటికీ, ఉన్నతాధికారుల ఒత్తిడితో శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర పోషించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం శ్రీకాంత్ పెరోల్‌ను రద్దు చేసింది. అప్పటి నుంచి అరుణ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆమెకు రాజకీయంగా, పోలీసు శాఖలో పలువురి మద్దతు ఉందని వార్తలు వచ్చాయి. దీనిపై ప్రస్తుత హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. పోలీసుల రికార్డుల్లో ఉన్న అరుణపై కఠిన చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన 24 గంటల్లోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు సమయంలో అరుణ తనపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనను అక్రమంగా అరెస్టు చేశారని వాదించారు. పోలీసులు తనపై గంజాయి కేసు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు. పడుగుపాడులోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు విషయంలో యజమానిని లక్ష రూపాయల మేర మోసం చేశారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది. అరెస్టు అనంతరం ఆమెను కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బుధవారం మధ్యాహ్నం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈమె వెనుక ఉన్న వారి వివరాలను పోలీసులు రాబట్టే అవకాశం ఉంది.