Lokesh Next : నెక్స్ట్ టార్గెట్ లోకేష్?.. సీఐడీ చీఫ్ సిగ్నల్స్!
రానున్న రోజుల్లో నారా లోకేష్ (Lokesh) ను కూడా జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
- By Pasha Published Date - 03:29 PM, Sat - 9 September 23

Next Target Nara Lokesh : టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ సర్కారు కుట్ర పన్నుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అరెస్టులతో టీడీపీ క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేయాలనే వ్యూహంతో జగన్ సేన ఉందని అంటున్నారు. ఈక్రమంలో రానున్న రోజుల్లో నారా లోకేష్ (Lokesh) ను కూడా జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాజధాని అమరావతి అలైన్ మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసుల్లో లోకేష్ పేరు ఉందని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలను అందుకు సంకేతంగా పరిగణించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
“లోకేష్ (Lokesh) నూ ప్రశ్నిస్తం .. రెండు స్కాముల్లో ఆయన పేరు ఉంది” అని సీఐడీ చీఫ్ సంజయ్ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు దారితీసింది. నిజానికి టీడీపీ హయాంలో ఈ రెండు కేసులకు సంబంధించిన మంత్రిత్వ శాఖలతో లోకేష్ కు సంబంధం లేదు. అప్పట్లో పంచాయతీరాజ్ , ఐటీ శాఖల మంత్రిగా లోకేష్ పని చేశారు. ఫైబర్ నెట్ అనేది ఐటీ శాఖ కిందకు రాలేదు. పరిశ్రమల శాఖ కిందకు వస్తుంది. రాజధాని అలైన్ మెంట్ కేసులో కూడా లోకేష్ పేరు ఎప్పుడూ వినిపించలేదు. ఈ విషయాల్లో లోకేష్ (Lokesh) పై ఇంత వరకూ కేసులు నమోదు కాలేదు.
అయినా సీఐడీ చీఫ్ సంజయ్ ఎందుకు లోకేష్ పేరును చెప్పారనేది అంతుచిక్కడం లేదు. ఈ కామెంట్స్ పై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ ప్రతీకార చర్యలను ఆపాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: Jagan Day : అమ్మో`ఫ్రై` డే! జగన్ స్క్రిఫ్ట్ భయానకం!!