HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nellore Tdp Bc Leader Fires On Cm Jagan

Nellore TDP : వచ్చే ఎన్నికల్లో బీసీలు టీడీపీకి అండగా నిలవాలి – టీడీపీ నేత చేజ‌ర్ల

బీసీ సబ్‌ప్లాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.1500 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదని తెలుగుదేశం సీనియర్ నేత చేజర్ల

  • Author : Prasad Date : 09-01-2023 - 7:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nellore tdp
Nellore tdp

బీసీ సబ్‌ప్లాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.1500 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదని తెలుగుదేశం సీనియర్ నేత చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మండిపడ్డారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో బీసీ విభాగం అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన మహాసభలో నెల్లూరు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ఇన్‌చార్జి అబ్దుల్‌ అజీజ్‌తో కలిసి ఆయ‌న స‌మావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసిన వారు స్వర్గీయ నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు వెచ్చించి సబ్ ప్లాన్ అమలు చేసిందన్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారని.. కానీ బీసీ సబ్ ప్లాన్ అమలు చేయలేదన్నారు.

బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్లు, నిధులు మాత్రమే కేటాయించకపోవడంతో అవి పేరుకు మాత్రమే మిగిలాయని విమర్శించారు. ముఖ్యమైన పార్టీ, ఇతర నామినేటెడ్ పదవులు అగ్రవర్ణాలకే ఇచ్చారని, బీసీలకు ప్రాధాన్యత లేని పదవులు మాత్రమే ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల శాతం తగ్గించడం వల్ల దాదాపు 16 వేల మంది బీసీ జనాభాకు రావాల్సిన పదవులు దక్కలేదన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాలపై దాడులు బాగా పెరిగాయని, టీడీపీలోని బీసీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క హామీని అమలు చేయకుండా జగన్ బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు టీడీపీకి అండగా నిలవాలని కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cm jagan
  • nellore tdp
  • tdp
  • TDP BC cell
  • ysrcp

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

Latest News

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd