HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Narayana Tongue Slip

Minister Narayana : మరోసారి నోరు జారి వివాదాల్లో చిక్కుకున్న ‘నారాయ‌ణ‌’

Minister Narayana : సింగపూర్ కంపెనీలకు ఇప్పటికే 1450 ఎకరాల భూములు కేటాయించామనీ, అయినా వారు ఎలాంటి కృతజ్ఞత చూపడం లేదని పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 26-07-2025 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Narayana Tague
Narayana Tague

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, మెట్రో ప్రాజెక్టులు వంటి కీలక బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్‌శాఖ మంత్రి నారాయణ(Minister Narayana)కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆయన విద్యావంతుడు, దూకుడులేని స్వభావం కలిగిన నాయకుడిగా పేరుగాంచారు. ఇప్పటివరకు వివాదాలకు దూరంగా ఉన్న నారాయణ ఇటీవల మాత్రం మాటల్లో అధిక ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇటీవల ఒక ఇంజనీర్‌పై ‘స్టుపిడ్’, ‘గెట్ ఔట్’, ‘వేస్ట్ ఫెలో’, ‘హోప్లెస్’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రతిపక్ష మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నారాయణ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అమరావతికి పెట్టుబడులు రాకపోవడాన్ని వ్యాఖ్యానిస్తూ..”అమరావతిని చూసి ఎవరు రావడం లేదు” అనే వాక్యంతో, ఆయన స్వయంగా అభివృద్ధి గురించి సందేహం కలిగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, అక్కడి కంపెనీలను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాంటి సందర్భంలో నారాయణ వ్యాఖ్యలు పెట్టుబడిదారులకు భయానక సంకేతాలుగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

HHVM 2 : ‘వీరమల్లు 2 ‘అనేది మరచిపోవాల్సిందేనా..?

నారాయణ మాట్లాడుతూ సింగపూర్ కంపెనీలకు ఇప్పటికే 1450 ఎకరాల భూములు కేటాయించామనీ, అయినా వారు ఎలాంటి కృతజ్ఞత చూపడం లేదని పేర్కొన్నారు. అంతే కాకుండా వారిని బ్రతిమాలుకునే పరిస్థితి వచ్చిందని, వెంబడించి వారిని తీసుకురావాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మాటలు సీఎంలాంటి నాయకుడి శ్రమను తక్కువ చేస్తూ, పెట్టుబడిదారుల మానసిక పరిస్థితిని గందరగోళంలోకి నెట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా గత వైసీపీ పాలనలో ఏర్పడిన అనిశ్చితి వాతావరణం వల్లే పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారన్న విషయం తెలిసిందే.

ఇలాంటి క్లిష్ట సమయంలో రాజధాని పై బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం. అధికారంలో ఉన్న వ్యక్తులు మౌలికమైన రాజకీయం, పరిపక్వత పాటించాలి. మంత్రిగా ఉన్న నారాయణ వ్యాఖ్యలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పెట్టుబడిదారుల నమ్మకం మరింత దెబ్బతింటుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇకనైనా మంత్రి నారాయణ జాగ్రత్తగా, సమయస్ఫూర్తితో మాట్లాడాలి అని అంత కోరుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • amaravati investments
  • Chandrababu Singapore Tour
  • Minister Narayana
  • narayana
  • Narayana Tongue slip
  • tdp
  • ycp

Related News

Midhun Reddy

Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మహిళల భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉండటం నేరస్తులను ప్రోత్సహించినట్లే అవుతుందని మిథున్ రెడ్డి హెచ్చరించారు

  • Radisson Blu 5-star property set to enter the City of Bulls Ongole

    Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Perninani Rappa Rappa

    Amaravati : అమరావతి మునిగిపోవాలని కోరుకుంటున్న పేర్ని నాని..! ఇదేనా ప్రజానాయకుడి తీరు ?

  • amaravati farmers land allotment

    Amaravati : ఇకపై అమరావతి స్పెల్లింగ్‌ అలాగే రాయాలి – అధికారులకు ఏపీ సర్కార్ ఆదేశాలు..!!

Latest News

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd