HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Ramamurthy Naidus Health Critical Chandrababu Cancels Delhi Trip Lokesh Heads To Hyderabad

Nara Ramamurthy Naidu: చంద్రబాబు తమ్ముడు ఆరోగ్య పరిస్థితి విషమం? బాబు ఢిల్లీ పర్యటన రద్దు, హైదరాబాద్‌కు లోకేష్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా, ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరారు. మరోవైపు, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనను రద్దు చేసి, హైదరాబాద్‌ రాబోతున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 16-11-2024 - 11:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Ramamurthy Naidu
Nara Ramamurthy Naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో, మంత్రి లోకేష్‌ అమరావతిలోని అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అనంతరం, అసెంబ్లీ నుంచి హుటాహుటిన గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి, హైదరాబాద్‌కు బయల్దేరారు. ప్రస్తుతం రామ్మూర్తి నాయుడు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన పరిస్థితి విషమంగా మారడంతో, హైదరాబాద్‌కు తరలించి ఆస్పత్రిలో చేర్చారు.

మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఢిల్లీలో జరిగే ఒక ఆంగ్ల పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొనిన తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఈ క్రమంలో, మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని కూడా వాయిదా వేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లాల్సి ఉండగా, ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసి హైదరాబాద్‌ రావచ్చని సమాచారం. అయితే, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు రామ్మూర్తి నాయుడు రెండో కుమారుడు. ఆయన, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు నటుడు నారా రోహిత్‌ మరియు నారా గిరీష్.

అన్న చంద్రబాబునాయుడు బాటలోనూ, రామ్మూర్తి నాయుడు 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీ చేసినప్పటికీ, గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. తర్వాత, రామ్మూర్తి నాయుడు అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాల నుంచి విరమించుకుని, దూరంగా ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Nara Chandrababu Naidu
  • nara lokesh
  • Nara Ramamurthy Naidu
  • Nara Ramamurthy Naidu Health Updates
  • Nara Rohith

Related News

Mahandu 2026

Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మహానాడు-2026 ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులు, కార్యకర్తలు పె

    Latest News

    • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

    • NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

    • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

    • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

    • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd