Nara Lokesh : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూర్తయిన నారా లోకేష్ పాదయాత్ర.. అనంతపురం జిల్లాలోకి ప్రవేశం
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూర్తయింది. 45 రోజుల పాటు 14 నియోజకవర్గాల్లో నారా
- Author : Prasad
Date : 17-03-2023 - 8:48 IST
Published By : Hashtagu Telugu Desk
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూర్తయింది. 45 రోజుల పాటు 14 నియోజకవర్గాల్లో నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. తంబాళ్లపల్లె నియోజకవర్గంలోని మొలకలచెరువు బోర్డర్ లో నారా లోకేష్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా లోకేష్ కు కాణిపాకం ఆలయ పండితులు శాలువా కప్పి ఆశీర్వదించారు. ఇటు క్రైస్తవ పాస్టర్లు, ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి లోకేష్ ను ఆశీర్వదించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజుల పాటు 577 కిమీ మేర నారా లోకేష్ పాదయాత్ర సాగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి నారా లోకేష్ పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్బంగా నారా లోకేష్‌కి.. కదిరి నియోజకవర్గం టీడీపీ కందికుంట ప్రసాద్, పార్టీ నేత చాంద్ బాషా, జిల్లా నేతలు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సవితమ్మ, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల పాటు కదిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు.