HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Yuvagalam 200 Days

Yuvagalam : నారా లోకేష్ ‘యువగళం కాదు ఇది ప్రజాగళం’

  • Author : Sudheer Date : 31-08-2023 - 1:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Yuvagaalam 200 Days
Lokesh Yuvagaalam 200 Days

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam ) నేటితో 200 వ రోజు (Yuvagalam 200 days)కు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేష్ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. వైసీపీ (YCP) ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టించిన ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ లోకేష్ యాత్ర (Lokesh Padayatra ) కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ కు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు (Chandrababu) శుభాకాంక్షలు తెలియజేశారు.

యువగళం ప్రజాగళం అయ్యింది అంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇప్పటి వరకు 77 నియోజకవర్గాల్లో 2710 కిలోమీటర్ల మేర లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. మొత్తం 185 మండలాలు, మున్సిపాలిటీలు, 1675 గ్రామాల మీదుగా లోకేశ్ పాదయాత్ర చేశారు. రోజుకు సగటున 13.5కి.మీ మేర పాదయాత్ర సాగుతోంది. యువగళం ద్వారా 64 బహిరంగసభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో యువనేత పాల్గొన్నారు. రాయలసీమలో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది.

Read Also : Adani Group: అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు.. మరోసారి భారీగా ఆస్తి నష్టం..!

లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra ) అనగానే వైసీపీ నేతలు (YCP Leaders) ఎద్దేవా చేసారు.10 కిమీ లైన లోకేష్ నడుస్తాడా..? మధ్యలోనే ఆపేస్తాడా..? అసలు లోకేష్ కు అంత సీన్ ఉందా..? అంటూ ఎవరికీ వారు ఇష్టానుసారంగా కామెంట్స్ , విమర్శలు చేసారు. కానీ అందర్నీ అంచనాలు తలదన్నేలా యాత్ర కొనసాగిస్తున్నారు. పది రోజులైనా నడుస్తాడా..? అన్నవారి నోర్లు మోసుకునేలా 200 వ రోజు కు చేరుకున్నాడు. 10 కిమీ కూడా నడవలేడు అని ఎద్దేవా చేసిన వారికీ 2710 కిలోమీటర్ల మేర నడిచి నారా వారి సత్తా ఇదిరా అని నిరూపించాడు.

తెలుగు నాట ఎంతోమంది పాదయాత్రలు చేశారు. దివగంత నేత రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, వైస్ షర్మిల, సీఎం జగన్ ఇలా అందరూ పాదయాత్ర చేసినవారే. అయినా ఎవరికి వారుగా తమ ముద్ర వేసుకున్నారు. ఈ తరుణంలో పాదయాత్రకు దిగిన లోకేష్ ఫై మొదట్లో ఎన్నో సెటైర్లు పడ్డాయి. కానీ ఆయన అదరలేదు బెదరలేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. విపక్ష నేతగా ఉన్న జగన్ పాదయాత్ర వారానికి ఐదు రోజులు మాత్రమే సాగేది. ఒకరోజు కోర్టుకు, మరో రోజు విశ్రాంతికి.. మధ్యలో కాళ్ల బొబ్బల కథలు, వాటికి వైద్యులు చేస్తున్న ట్రీట్మెంట్ల ఇలా పాయాత్ర సాగింది. కానీ అందుకు విరుద్ధంగా లోకేష్ యాత్ర కొనసాగుతోంది. నిర్విరామంగా ముందుకు కదులుతోంది. అసలు పాదయాత్ర చేయలేడు అన్న లోకేష్.. 2700 కిలోమీటర్ల నడిచి చూపించారు. అసలు మాట్లాడడం రాదన్న లోకేష్ ఘాటైన ప్రసంగాలతో అధికార పార్టీ పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తూ వస్తున్నాడు.

Read Also : Modi : మోదీకి 80 శాతం ఆమోదం.. మరి విపక్షాల మాటేమిటి?

ప్రస్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర పోలవరం (Polavaram) నియోజకవర్గం సీతంపేట వద్ద 200వ రోజున 2700 కి.మీ.ల మైలురాయిని చేరుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుంచి 200వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా పాదయాత్రలో నారా భువనేశ్వరి, నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Chnadrababu
  • nara lokesh
  • nara lokesh yuvagalam
  • nara lokesh yuvagalam 200 days
  • tdp
  • yuva galam

Related News

Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Nara Lokesh లక్షల హృదయాల ప్రార్థనలు ఓవైపు, మంత్రి నారా లోకేశ్ కృషి మరోవైపు… అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాన్ని నిలబెట్టాయి. కొన్ని నెలలుగా ‘సేవ్ పునర్విక’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగిన మానవతా ఉద్యమానికి సార్థకత లభించింది. ఆ పసిమొగ్గకు ప్రాణం నిలిచింది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA టైప్-1) వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఏడాది చిన్నారి పునర

  • Midhun Reddy

    Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • AP Education Minister Nara Lokesh

    TDP Working President : నారా లోకేష్ పదవి పై వర్మ కీలక వ్యాఖ్యలు

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd