Nara Lokesh: దళితవర్గంపై ‘జగన్’ దమనకాండ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన పార్టీ నేతలు సామాజికవర్గ నేతలు దళితులపై సాగిస్తున్న దమనకాండకి హద్దే లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- By Balu J Published Date - 01:48 PM, Tue - 1 March 22

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన పార్టీ నేతలు సామాజికవర్గ నేతలు దళితులపై సాగిస్తున్న దమనకాండకి హద్దే లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సామాజికవర్గంపై దాడులు జరుగుతుండటంతో నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని నందనూరు పంచాయతీ పెద్దకంటిపల్లి గ్రామానికి చెందిన చంద్రన్ ను కాళ్లూ చేతులు విరగ్గొట్టించేయడం పైశాచికానికి పరాకాష్ట అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులైన దళితులు స్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్.. వైసీపీ ఆర్డర్‌లో ఉందని తేటతెల్లం చేస్తోంది అని పోలీసులపై తీరుపై మండిపడ్డారు. జగన్ భజనలో మునిగి తేలే దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి.. మీ దళితజాతికి ఇంత అన్యాయం జరుగుతుంటే.. స్పందించరేం? అని ప్రశ్నించారు. దళితుడైన చంద్రన్ ని దండించిన ఈశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, పోలీసులు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని నారా లోకేశ్ మండిపడ్డారు.
https://twitter.com/naralokesh/status/1498565072565981184