Yuvagalam : ‘యువగళం కాఫీ టేబుల్ బుక్’ ఆవిష్కరించిన ప్రధాని.. సంతకం చేసి లోకేశ్‌కు బహూకరణ
‘‘యువగళం కాఫీ టేబుల్ బుక్’’ను(Yuvagalam) ప్రధానమంత్రి ఆవిష్కరించి.. ఆ పుస్తకంపై సంతకం చేసి లోకేశ్‌కు గొప్ప జ్ఞాపకంగా అందజేశారు.
- By Pasha Published Date - 09:09 AM, Sun - 18 May 25

Yuvagalam : 2024 ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రంలో చారిత్రాత్మకంగా 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వేలాది మంది ప్రజలతో మమేకం అయ్యారు. వారిక సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. తాను జననేతను అని లోకేశ్ నిరూపించుకున్నారు. యువగళం పాదయాత్ర అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి బాటలు వేసింది. ఆ పాదయాత్రకు సంబంధించిన విశేషాలతో ‘‘యువగళం కాఫీ టేబుల్ బుక్’’ను రూపొందించారు. ఈ బుక్ ఆవిష్కరణ కోసం నారా లోకేశ్ కుటుంబ సమేతంగా న్యూఢిల్లీకి వెళ్లారు. పుస్తకం మొదటి ప్రతిని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఏపీ మంత్రి నారా లోకేశ్ అందజేశారు.
Also Read :Worlds First AI Doctor : ప్రపంచ తొలి ఏఐ డాక్టర్, ఏఐ క్లినిక్.. పనిచేసేది ఇలా
‘‘యువగళం కాఫీ టేబుల్ బుక్’’ను(Yuvagalam) ప్రధానమంత్రి ఆవిష్కరించి.. ఆ పుస్తకంపై సంతకం చేసి లోకేశ్‌కు గొప్ప జ్ఞాపకంగా అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని మోడీ ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేశ్ ఈసందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి సదా రుణపడి ఉంటామని లోకేశ్ చెప్పారు. 2047 వికసిత భారత్ లక్ష్యానికి చేరుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశా నిర్దేశం చేయాలని ప్రధానిని ఆయన కోరారు. ఏపీకి అన్ని రకాల సహాయ సహకారాలను అందించాలన్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం తన కుటుంబానికి మరపురాని భేటీ అని, దీన్ని కలకాలం గుర్తుంచుకుంటామని లోకేశ్ తెలిపారు.