Worlds First AI Doctor : ప్రపంచ తొలి ఏఐ డాక్టర్, ఏఐ క్లినిక్.. పనిచేసేది ఇలా
సౌదీలో ఏర్పాటైన ఈ ఏఐ క్లినిక్‌కు ‘డాక్టర్ హువా’(Worlds First AI Doctor) అని పేరుపెట్టారు.
- By Pasha Published Date - 08:53 AM, Sun - 18 May 25

Worlds First AI Doctor : ఇది కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఏఐ టెక్నాలజీతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారిగా ఏర్పాటైంది. ఎక్కడొో తెలుసా ? సౌదీ అరేబియాలో !! దీన్ని ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా ? చైనాకు చెందిన మెడికల్ టెక్నాలజీ కంపెనీ సైన్యీ ఏఐ. ఏఐ రంగంలో చైనా దూసుకుపోతున్న తీరుకు ఈ ఆవిష్కరణ ఒక నిదర్శనం. వివరాలివీ..
Also Read :Pakistani Beggars : పాక్ జనాభా 26 కోట్లు.. బెగ్గర్స్ 2.2 కోట్లు.. షాకిచ్చిన సౌదీ
తొలి ఏఐ క్లినిక్ ఇలా పనిచేస్తుంది..
- చైనాకు చెందిన సైన్యీ ఏఐ కంపెనీ, సౌదీ అరేబియాకు చెందిన అల్‌మూసా హెల్త్ గ్రూప్‌తో కలిసి ప్రపంచంలోనే తొలి ఏఐ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది.
- సౌదీలో ఏర్పాటైన ఈ ఏఐ క్లినిక్‌కు ‘డాక్టర్ హువా’(Worlds First AI Doctor) అని పేరుపెట్టారు.
- ఈ క్లినిక్‌ను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నడపనున్నారు.
- సౌదీలోని అల్ అహ్సా ప్రావిన్స్‌లో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు.
- ఈ క్లినిక్‌లోని ఏఐ డాక్టర్ తొలుత రోగులతో సంభాషిస్తాడు. వారి ఆరోగ్య సమస్యల వివరాలను, రోగ లక్షణాలను తెలుసుకుంటాడు. ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ చేస్తాడు. తదుపరిగా చికిత్సను మొదలుపెడతాడు. ఈ ప్రక్రియను వైద్య నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
- ఈ క్లినిక్‌లోకి రోగి ఎంటరయ్యాక.. ఒక ట్యాబ్ సాయంతో ఏఐ డాక్టర్‌కు తమ వ్యాధి లక్షణాలను వివరించాలి. వెంటనే అది కొన్ని ప్రశ్నలు వేస్తుంది. వాటికి సమాధానాలు చెప్పాలి.
- అనంతరం మానవ సహాయకుల సాయంతో సేకరించిన డేటాను, చిత్రాలను విశ్లేషిస్తారు.
- ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత డాక్టర్ హువా వైద్య చికిత్స ఎలా చేసుకోవాలని సిఫారసులు చేస్తుంది.
- ఇదంతా అక్కడున్న వైద్య నిపుణుడు విని.. సమీక్షించి.. సంతకం చేస్తాడు.
- ఏఐ పరిశీలించలేని అత్యవసర కేసుల వ్యవహారంలో నేరుగా వైద్యులే అన్నీ చూస్తారు.
- సౌదీలోని ఈ ఏఐ డాక్టర్ ఉబ్బసం సహా దాదాపు 30 రకాల శ్వాసకోశ రుగ్మతలకు సంబంధించిన కన్సల్టేషన్ సేవలను అందించగలడట.
- రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ 50 శ్వాస, జీర్ణకోశ, చర్మ సంబంధ వ్యాధులకు సేవలను అందిస్తాడట.