Nara Lokesh : సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే..!
ఏపీలో ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఓవైపు ప్రజలకు దగ్గరవుతూనే.. మరో వైపు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
- Author : Kavya Krishna
Date : 01-04-2024 - 8:41 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఓవైపు ప్రజలకు దగ్గరవుతూనే.. మరో వైపు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ జెండాను ఎగురవేసేందుకు తీవ్ర ఎండను సైతం లెక్కచేయకుండా.. ప్రజల్లోకి వెళ్తున్నారు నారా లోకేష్. అయితే.. సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) (Alla Ramakrishna Reddy)పై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చురకలు అంటించారు. ప్రజాసేవకు అధికారం ఒక్కటే సరిపోదని ఆయన ఉద్ఘాటించారు.. ఇతరులకు సహాయం చేయాలనే సంకల్పాన్ని కూడా కలిగి ఉండాలని నారా లోకేష్ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఓ వికలాంగుడిని పరామర్శించిన ఫొటోలను లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “తాడేపల్లికి చెందిన ఈ వ్యక్తి కోడే కోటేశ్వర రావు (Koda Koteswara Rao). కొన్ని నెలల క్రితం తన కుటుంబాన్ని తన సొంతంగా పోషించుకోవడానికి నేను అతనికి తోపుడుబండి ఇచ్చాను. ఇలాంటి వేలాదిమందికి గత అయిదేళ్లుగా నేను చేయూతనిచ్చా. మహిళల స్వయం ఉపాధి శిక్షణతోపాటు కుట్టుమిషన్లు ఇచ్చా. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటుచేశా. 29సంక్షేమ పథకాలను అయిదేళ్లుగా సొంత నిధులతో అమలుచేస్తున్నా. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే నేను చేసిన పనుల్లో పదోవంతైనా సాయం చేశారా? మీరు చేసింది ఏమిటంటే ముఖ్యమంత్రి ఇంటివద్ద ఇరుకుగా ఉందని పేదల ఇళ్లు కూల్చేశారు. ఇప్పటం, ఆత్మకూరులో రోడ్డు విస్తరణ పేరుతో బుల్డోజర్లను పంపి పేదల బతుకులను రోడ్డు పాల్జేశారు. సేవచేయడమంటే కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడం, పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న పేదల గూళ్లు కూల్చివేయడం కాదు కరకట్ట కమలహాసన్!!’ అంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఆర్కేపై విమర్శలు గుప్పించారు.
Read Also : TDP vs YCP : వైపీసీ కుతంత్రాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్..!