Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత.. కుప్పం ఆస్పత్రికి తరలింపు
నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
- Author : Balu J
Date : 27-01-2023 - 1:14 IST
Published By : Hashtagu Telugu Desk
నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్రలో స్పృహతప్పి పడిపోగా.. హుటాహుటిన కుప్పం (Kuppam) కేసీ ఆస్పత్రికి తరలించారు. నందమూరి బాలయ్య కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. నారా లోకేష్ లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల పాదయాత్ర ప్రారంభించారు.
అనంతరం కొద్దిదూరం నడిచిన అనంతరం.. అక్కడ మసీదులో లోకేష్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. తారకరత్న (Nandamuri Taraka Ratna) కూడా లోకేష్ వెంట మసీదులోకి వెళ్లారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానుల తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు (Nandamuri Taraka Ratna) గుండెపోటు కూడా వచ్చి ఉంటుందని కూడా భావిస్తున్నారు.
Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డితో గురునాథ్ రెడ్డి భేటీ