HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nagari Faction Fight Reaches Jagan

AP Faction Fight: ‘నగరి’ వైసీపీలో వర్గపోరు.. జగన్ కు రోజా కంప్లైంట్

నగరి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీ వర్గపోరు తారాస్థాయికి చేరడంతో పర్యాటక శాఖ మంత్రి రోజా సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు.

  • Author : Balu J Date : 27-10-2022 - 1:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Roja And Jagan
Roja And Jagan

నగరి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీ వర్గపోరు తారాస్థాయికి చేరడంతో పర్యాటక శాఖ మంత్రి రోజా సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రోజా నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రోజా కేబినెట్ లో హోదా దక్కించుకన్న తర్వాత ఎన్నికల అనంతరం శ్రీశైలం దేవస్థానం చరిమన్‌రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేటన్‌ చైర్‌పర్సన్‌ కేజే శాంతి, నగరి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కేజేకుమార్‌, పుత్తూరుకు చెందిన ఏలుమలై, విజయపురం లక్ష్మీపతి రాజులను రోజా దూరంగా ఉంచుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

వీరంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులుగా ముద్ర పడ్డారు. అప్పటి నుంచి నగరి వైఎస్సార్‌సీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. పెద్దిరెడ్డి మద్దతుతో కొందరు నేతలు పదవులు లాక్కోవడం, రోజా ప్రత్యర్థి వర్గం ఫ్లెక్సీలు చింపివేయడం ఇప్పటికే జరుగుతున్న ఘర్షణకు మరింత ఆజ్యం పోసింది. కాగా, ఇటీవల కొప్పెడులో మంత్రి రోజా ప్రత్యర్థి వర్గం ఆమె జోక్యం లేకుండానే ఆర్‌బీకే, వెల్‌నెస్‌ సెంటర్లకు భూమిపూజ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రోజా.. పార్టీ నేతలకు ఆడియోను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ ఆడియోలో రోజా మాట్లాడుతూ.. పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమాలు చేస్తూ నా నియోజకవర్గంలో పార్టీని నిర్వీర్యం చేయడం ఎంత వరకు కరెక్ట్? పార్టీ కోసం కష్టపడుతున్న నన్ను మానసికంగా హింసిస్తున్నారు. నాయకులు వారికి మద్దతు పలకడం దారుణం. అలాంటి వ్యక్తులు పార్టీలో కొనసాగితే నేను పని చేయలేను అని తేల్చి చెప్పింది. దీంతో నగరి గొడవలు రసవత్తరంగా మారాయి. రోజా ఫిర్యాదుపై జగన్ స్పందన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra politics
  • AP CM Jagan
  • Minister Peddireddy
  • Minister Roja
  • Nagari MLA

Related News

Ambati Rambabu One Day Hunger Strike

Nirahara Deeksha: అంబటి నిరాహార దీక్ష..

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా, నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో అంబటి నేడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై, పోలీసు వ్యవస్థపై నిప్పులు చెరిగారు. “చంద్రబాబును దూషించాననే సాకుతో నన్ను అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో ఉంచారు.. మరి న

    Latest News

    • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

    • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

    • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

    • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    Trending News

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd