Nagababu : కూటమి ఫై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు – నాగబాబు వార్నింగ్
కూటమి విజయాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైన సరే కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదు
- Author : Sudheer
Date : 13-06-2024 - 11:55 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో కూటమి భారీ విజయం సాధించింది..ఈరోజు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడమే కాదు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ఏకంగా ఐదు కీలక హామీలపై సంతకం చేసి..ప్రజల్లో నమ్మకం నిలబెట్టారు. అయితే కొన్ని మీడియా చానెల్స్ కూటమి ఫై చేస్తున్న తప్పుడు ప్రచారం ఫై జనసేన నేత నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. కూటమి విజయాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైన సరే కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే ఇలాంటి వార్తలని స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు చేపట్టామని , జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి స్పిరిట్‌ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే కచ్చితంగా తగిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ”వైసీపీ ఇంకా పూర్తిగా చావలేదు. ఇంకా బతికే ఉంది. ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలివి. వాటినెవ్వరు పట్టించుకోకండి. కూటమికి సంబంధించిన మూడు పార్టీల అధినేతలు సమిష్టి, నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలను ఎవరు రాసినా, స్ప్రెడ్ చేసినా ఆ సోర్స్ పట్టుకుని వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తాం…జాగ్రత్త.” అని నాగబాబు హెచ్చరించారు.
కూటమి విజయాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైన సరే కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికే ఇలాంటి వార్తలని స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు చేపట్టాం.
జనసేన-టిడిపి-బిజెపి కూటమి స్పిరిట్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖశ్చితంగా తన తగిన కఠిన చర్యలు తీసుకోబడతాయి..… pic.twitter.com/mi51WMZtbI
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 13, 2024
Read Also :