Nadendla Manohar : జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్
పార్టీ చీఫ్ విప్ గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులివర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ
- Author : Sudheer
Date : 22-07-2024 - 8:04 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ అసెంబ్లీలో జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ (Janasena Party deputy floor leader in AP Assembly) గా మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాచారం అందించారు. అలాగే పార్టీ చీఫ్ విప్ గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులివర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ లను నియమించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె..అసెంబ్లీ నిర్వహణ, చర్చ చేపట్టాల్సిన అంశాలపై బీఏసీ సమావేశంలో చర్చించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బేజీపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. వైసీపీ మాత్రం గైర్హాజరైంది. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలనేదానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరుగుతాయని, 2 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని , ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుతో పాటు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లు కూడా ఉంటుందని తెలిపారు. అలాగే ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశపెట్టనుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
Read Also : Telangana Assembly : రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు