Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ అరెస్ట్ ..
- By Sudheer Published Date - 01:15 PM, Mon - 11 December 23

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టైకూన్ హోటల్ దగ్గర రహదారి మూసివేతకు నిరసనగా జనసేన మహాధర్నా (Janasena Mahadharna) కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎంపీ MVV సత్యనారాయణ (MVV Satyanarayana)కు వ్యక్తిగత లబ్ధి చేయడానికే ఈ రహదారి మూసివేశారని, ఎంపీకి చెందిన నిర్మాణాలకు వాస్తు దోషం తొలగించేందుకు రోడ్డు మూసివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్‌తో పాటు కార్యకర్తలు అక్కడకు చేరుకొని నిరసన చేపట్టారు. ప్రస్తుతం సెక్షన్ 30 అమలులో ఉండటంతో.. జనసేన ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ జనసేన శ్రేణులు ధర్నాకు దిగడం తో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే ధర్నాకు వెళ్తున్న మనోహర్ ను సైతం నోవాటెల్ హోటల్ వద్ద అరెస్ట్ చేసారు. నోవాటెల్ గేట్లు మూసేసి నాదెండ్ల మనోహర్ తో పాటు ఇతర జనసేన నాయకులెవరూ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టైకూన్ జంక్షన్ కు వెళ్లేందుకు అనుమతి లేదని నాదెండ్లకు పోలీసులు సూచించారు. దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో నాదెండ్ల మనోహర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుండి తరలించారు.
విశాఖలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ @mnadendla శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని నోవాటెల్ దగ్గర అరెస్టు చేసిన పోలీసులు
* విశాఖ టైకూన్ జంక్షన్ మూసివేతని నిరసిస్తూ ఆ కూడలికి వెళ్ళే ప్రయత్నం చేయగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అరెస్టు#HelloAP_ByeByeYCP pic.twitter.com/Ni4nBqsJod
— JanaSena Party (@JanaSenaParty) December 11, 2023
Read Also : CM Revanth Reddy : మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న సీఎం రేవంత్