HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Murder In Palnadu District

Murder : ప‌ల్నాడు జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురు హ‌త్య‌

పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో చిన్న చిన్న గొడవలతో ఒకే

  • Author : Prasad Date : 24-11-2023 - 7:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో చిన్న చిన్న గొడవలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మృతులు అనంత్ నరేష్ (32), అతని తల్లిదండ్రులు అనంత్ సాంబశివరావు (63), అనంత్ ఆదిలక్ష్మి (60)గా పిడుగురాళ్ల పోలీసులు గుర్తించారు. ఆరేళ్ల క్రితం సత్తెనపల్లికి చెందిన తన మొదటి భార్య బోయ్యలశెట్టి ప్రియాంకకు అనంత్‌ నరేష్‌ విడాకులు ఇచ్చి ముప్పాళ్ల మండలం దమ్మాలపాటి గ్రామానికి చెందిన దొమ్మా మాధురిని వివాహం చేసుకున్నాడు. నరేష్ తన 15 ఎకరాల భూమిలో వ్యవసాయ పని చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. న‌రేష్ రెండ‌వ భార్య మాధురి కూడా అతనితో పాటు ప‌నికి వెళ్లేది.వీరికి ఆరేళ్ల బాలుడు వేణు గోపాల్ ఉన్నాడు. అయితే బుధవారం మాధురి కడుపునొప్పితో బాధపడుతుందని, పనికి వెళ్లడం ఇష్టం లేదని, తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని భర్తను కోరింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ స‌మ‌యంలో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అదేరోజు రాత్రి మాధురి తన సోదరుడు దొమ్మా శ్రీనివాసరావుకు, తండ్రి సుబ్బారావుకు ఫోన్ చేసి జరిగిన గోడ‌వ గురించి చెప్పింది. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన మాధురి తండ్రి, సోద‌రుడు కత్తి పట్టుకుని ఆమె ఇంటికి చేరుకున్నారు. మాధురి అత్తమామలు సాంబశివరావు, ఆది లక్ష్మి సమక్షంలో మాధురిని ఇబ్బంది పెట్టిన విష‌యం గురించి ఆరా తీస్తుండగా నరేష్ మాధురి మెడ పట్టుకుని మళ్లీ గొడవకు దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసరావు తన తండ్రి సుబ్బారావులు.. అల్లుడు నరేష్, అత్తామామలు సాంబశివరావు, ఆదిలక్ష్మిలను కత్తితో పొడిచి చంపాడు. హ‌త్య అనంత‌రం ఇద్దరు ముప్పాళ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  Harassment : కర్ణాటకలో దారుణం.. భార్య ప్ర‌వేట్ పార్ట్స్‌పై యాసిడ్ పోసిన భ‌ర్త‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • murder
  • Palnadu District

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

  • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

  • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

  • RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

  • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd