Mudragada kranthi : జనసేనలో చేరిన ముద్రగడ కూతురు క్రాంతి..
Mudragada kranthi : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తోందని పేర్కొన్నారు
- By Sudheer Published Date - 09:08 PM, Sat - 19 October 24

జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో శనివారం ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి(Mudragada Padmanabham’s daughter Kranti) తో పాటు గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, జగ్గయ్యపేటకు చెందిన నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు జనసేనలో చేరారు. వారికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్.
గత ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram)లో పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఆయన సవాల్ కూడా చేశారు. అన్నట్టుగానే సవాల్ లో ఆయన ఓడిపోవడంతో పేరు మార్చుకున్నారు. ఈ వ్యవహారంలో ముద్రగడ కూతురు పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా నిలిచి తండ్రికి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ సమయంలోనే జనసేన లో చేరతానని తెలిపింది. చెప్పినట్లే ఈరోజు పవన్ సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన నాయకులకు అభినందనలు తెలిపారు. జనసేనలో చేరికలు తమపై విశ్వాసాన్ని మరింత పెంచాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చటం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జనసేన పార్టీలో వైసీపీ నుంచి నాయకులు చేరారు. శనివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు నాయకులు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో పార్టీలో చేరారు.
•రాజమండ్రికి చెందిన శ్రీమతి క్రాంతి దంపతులు, అమలాపురంకి చెందిన శ్రీ కల్వకొలను తాతాజీ,… pic.twitter.com/MAbtpqMfI2
— JanaSena Party (@JanaSenaParty) October 19, 2024
Read Also : Group 1 Exams : ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన గ్రూప్-1 పరీక్షలు ఆగవు – సీఎం రేవంత్