Vijayasai Convoy : ఎంపీ విజయసాయి కాన్వాయ్ ఢీ ..వ్యక్తికి తీవ్రగాయాలు
ఒంగోలు నుంచి కాన్వాయ్ వస్తూ ఒంగోలు నగర పరిధిలో రాగానే బైక్ ఫై వెళ్తున్న ఓ వ్యక్తిని కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీ కొట్టింది
- Author : Sudheer
Date : 09-11-2023 - 11:09 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ ఎంపీ విజయసాయి (V. Vijaysai Reddy) కాన్వాయ్‌లోని ఓ వాహనం (Convoy) ఢీ కొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయినా ఘటన ఒంగోలు (Ongole ) లో చోటుచేసుకుంది. కనిగిరిలో నిర్వహించిన వైసీపీ ‘సామాజిక సాధికార బస్సు (YSRCP Samajika Sadhikara Bus Yatra) యాత్ర’లో పాల్గొనేందుకు ఒంగోలు నుంచి కాన్వాయ్ వస్తూ ఒంగోలు నగర పరిధిలో రాగానే బైక్ ఫై వెళ్తున్న ఓ వ్యక్తిని కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పునాటి నాగేశ్వరరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయాణిస్తున్న కారే బైక్‌ని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మరో వాహనంలో ఎంపీ వెళ్లిపోయారని అంటున్నారు. బాధితుడి స్వగ్రామం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతలకు చెందినవాడు. ఈయన పేర్నమిట్టలోని ఓ రైస్‌మిల్లులో పనిచేస్తున్నాడని స్థానికులు చెపుతున్నారు. ప్రస్తుతం బాధితుడు ఓ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఫై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ప్రమాదం జరిగిన ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఏంటి అని..ప్రాణం పోయిన అంతే సంగతా అని ప్రశ్నిస్తున్నారు.
Read Also : IT Raids : బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు – రేవంత్ ప్రశ్న