IT Raids : బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు – రేవంత్ ప్రశ్న
నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!?
- By Sudheer Published Date - 10:53 AM, Thu - 9 November 23

మరోసారి ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల సమయం (Elections Time) దగ్గర పడుతున్న టైములో వరుసపెట్టి కాంగ్రెస్ నేతల (Congress Leaders) ఇళ్లపై , ఆఫీసుల ఫై ఐటీ రైడ్స్ జరగడం కుట్రపూరితమేనని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అధికార పార్టీ (BRS) నేతలను , బిజెపి (BJP)నేతలను వదిలిపెట్టి కేవలం కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేయడం ఏంటి అని సదరు కార్యకర్తలు ప్రశ్నింస్తున్నారు.
ఈరోజు ఉదయం నుండి పాలేరు కాంగ్రెస్ అభ్యర్థు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇళ్లపై , ఆఫీస్ లపై పెద్ద ఎత్తున ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు ఖమ్మం లో కూడా రైడ్స్ జరుగుతున్నాయి. ఈ దాడులను కాంగ్రెస్ కార్యకర్తలు , నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే రైడ్స్ జరుగుతున్న ఇళ్ల వద్దకు ఆఫీస్ ల వద్దకు పెద్ద ఎత్తున పొంగులేటి అభిమానులు , పార్టీ కార్యకర్తలు చేరుకొని దాడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఐటీ రైడ్స్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రంగా ఖండించారు. గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన ‘నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ బెంబేతెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం.’ అని ట్వీట్ చేశారు.
నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!?
బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!?
రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని…
— Revanth Reddy (@revanth_anumula) November 9, 2023
Read Also : Harish Rao: మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు