CBN-Nara Lokesh : తండ్రి కేసును టేకప్ చేస్తే కుమారుడి కేసు ఫ్రీ – విజయసాయి సెటైర్లు
తండ్రి కేసును టేకప్ చేస్తే కుమారుడి కేసు ఫ్రీ అని , తండ్రికొడుకుల ఆట ముగిసిందని , ‘తండ్రి ఎలాగో… కుమారుడు అలాగే! ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో లోకేష్ A-14గా చేరారు.
- By Sudheer Published Date - 12:54 PM, Wed - 27 September 23

కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత సంబరపడుతుందో..వైసీపీ నేతలు (YCP Leaders) కూడా చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తో అంత సంబరపడుతున్నారని.. బాబుకు శిక్ష ఖరారు కాలేదని..జస్ట్ జ్యూడిషనల్ కస్టడీలో మాత్రమే ఉన్నాడనే సంగతి కూడా మరచిపోయి..ఏదో సాధించాం..ఓ పెద్ద ఉగ్రవాదుడ్ని జైల్లో పెట్టాం..కోట్లాది కోట్లు మింగేసిన భారీ తిమింగళాన్ని పట్టుకున్నాం అన్నట్లు వైసీపీ నేతలు తెగ హడావిడి చేస్తున్నారని..టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. గత 19 రోజులుగా ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. ప్రస్తుతం పలు కోర్ట్ లలో ఈ స్కామ్ ఫై వాదనలు జరుగుతున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం రోజు రోజుకు మరింత రెచ్చిపోతూ ఉండడం తెలుగు ప్రజల్లో ఆగ్రహం నింపుతుంది. ఓ పక్క యావత్ తెలుగు ప్రజలు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ..సంఘీభావం తెలుపుతుంటే..వైసీపీ నేతలు మాత్రం సోషల్ మీడియా లలో సెటైర్లు వేస్తూ వస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy)..లోకేష్ ఫై తనదైన స్టయిల్ లో సెటైర్లు వేసి వార్తల్లో నిలిచారు. తండ్రి కేసును టేకప్ చేస్తే కుమారుడి కేసు ఫ్రీ అని , తండ్రికొడుకుల ఆట ముగిసిందని , ‘తండ్రి ఎలాగో… కుమారుడు అలాగే! ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో లోకేష్ A-14గా చేరారు. ఇప్పుడు లోకేష్ ఢిల్లీలో లాయర్లకు buy-one-get-one-free-scheme ఆఫర్ ఇవ్వాలి అంటూ సెటైర్లు వేశారు.
Read Also : Anasuya Bharadwaj : చీరకట్టి గ్లామర్ తో మ్యాజిక్ చేస్తున్న అనసూయ భరద్వాజ్
తండ్రి కేసును టేకప్ చేస్తే కుమారుడి కేసు ఫ్రీగా పొందవచ్చు. వారిద్దరి పని ముగిసింది’ అని విజయసాయి ట్వీట్ చేశారు. రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారని మరో ట్వీట్ లో పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఇది వాళ్లకు కొత్తేం కాదు. డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ. ఆ పార్టీ పునాదులే దోపిడీపైన ఏర్పడ్డాయని సెటైర్లు పేల్చారు. ఈ పోస్టుల ఫై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ముందుంది ముసళ్ళ పండుగ అంటూ హెచ్చరిస్తున్నారు.
https://x.com/VSReddy_MP/status/1706858726546939984?