MP Balasouri : టీడీపీ లోకి వైసీపీ ఎంపీ బాలశౌరి..?
- By Sudheer Published Date - 02:40 PM, Sat - 6 January 24

అప్పుడప్పుడు మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు తీవ్ర నష్టాల పాలుచేస్తుంది..ఇప్పుడు జగన్ విషయంలో అదే జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో సర్వేల రిపోర్ట్..ఆధారంగా నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్చడం..చాలామందికి టికెట్స్ ఇచ్చేందుకు నిరాకరించడం ఇవన్నీ పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చేలా చేస్తున్నాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తో పెద్ద ఎత్తున నేతలు బయటకొస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఫేక్ సర్వేల రిపోర్ట్ చూసి టికెట్ ఇవ్వం అని చెప్పడం సరికాదని..అసలు నియోజకవర్గాన్ని ఎలాంటి నిధులు ఇవ్వకుండా డెవలప్ చేయాలని చెపితే ఎలా చేస్తామని..కనీసం ఐదేళ్లలో పట్టుమని పదిసార్లైనా స్వయంగా కలిసే అవకాశం ఇవ్వకుండా తప్పంతా మాదే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నేతలు గగ్గోలు పెడుతూ జగన్ ఫై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ కి రాజీనామా చేసి, టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..ఈ నెల చివరికల్లా వైసీపీ సగం ఖాళీ అవుతుందని బయటకొచ్చిన నేతలు చెపుతున్నారు.
తాజాగా మరో నేత వైసీపీ కి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. మచిలీపట్నం లోక్‌సభ ఎంపీ(Machilipatnam Lok Sabha MP) బాలశౌరి(Balashauri) టీడీపీలోకి జంప్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మంచి పట్టు ఉన్న సీనియర్ నాయకుడు బాలశౌరి. అంతకుముందు 2004లో దివంగత వైఎస్ఆర్(YSR) నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి ఎంపీ(Tenali MP)గా పని చేశారు. ఆయన వైసీపీని వీడితే పెద్ద ఎదురుదెబ్బ తప్పదని భావిస్తున్నారు. మరి బాలశౌరి పార్టీ మారతారా..లేదా..ఒకవేళ జగన్ ఆయనతో మాట్లాడతారా అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు రాబోతున్నారని మాత్రం గట్టిగా ప్రచారం అవుతుంది.
Read Also : BalaKrishna : పార్లమెంట్ బరిలో బాలయ్య…?