Modi : మోడీ ఏపీ టూర్ డేట్స్ ప్రకటించిన బిజెపి..
ప్రధాని మోడీ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు బిజెపి అధిష్టానం మోడీ పర్యటనకు సంబదించిన తేదీలను ప్రకటించింది
- Author : Sudheer
Date : 24-04-2024 - 8:28 IST
Published By : Hashtagu Telugu Desk
అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ (Pradani Modi) ఏపీలో ఎన్నికల ప్రచారం (Election Campaign in AP)లో పాల్గొనబోతున్నారు. ఏపీలో బిజెపి -టీడీపీ-జనసేన (NDA Alliance) కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు బిజెపి అధిష్టానం మోడీ పర్యటనకు సంబదించిన తేదీలను ప్రకటించింది. మే 3, 4 తేదీల్లో మోడీ ఏపీకి వస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ తెలిపింది. ఈ రెండు రోజుల పర్యటన కోసం రోడ్ షోలు, సభా వేదికలను నేతలు ఖరారు చేయనున్నారు. బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా మోడీ ప్రచారం నిర్వహించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. ‘జగన్ సర్కార్ అందినకాడికి అప్పులు చేసిందని ఆరోపించారు. దాదాపు రూ.13.50 లక్షల కోట్ల అప్పు చేసి.. ఒక్కొక్కరిపై రూ.2 లక్షల భారం మోపిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని తెలిపారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి జోరు కనిపిస్తుంది. కూటమి పార్టీల నేతలు , కార్యకర్తలంతా కలిసి ప్రచారం చేస్తూ కూటమి విజయం కోసం కష్టపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బిజెపి చీఫ్ పురందేశ్వరి సైతం ప్రచారంలో దూకుడు కనపరుస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఎక్కడిక్కడే వైసీపీ చేసిన అప్పులు , నేరాలు , దారుణాలు , కబ్జాలు ఇలా అన్నింటిని ప్రజలకు వివరిస్తూ..మరోసారి వైసీపీ వస్తే రాష్ట్రం ఎడారి అవుతుందని తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నారు.
Read Also : Kalki 2898 AD : బాహుబలి స్టైల్‌లో కల్కి ప్రమోషన్స్.. ఈవారం మరో పాత్ర గ్లింప్స్ అప్డేట్..