Modi Speech Pileru Meeting : జగన్ సర్కార్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్ – మోడీ
వైసీపీ శాండ్ మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. పేదల వికాసం కోసం కాదు, మాఫియా వికాసం కోసం పని చేసిందని దుయ్యబట్టారు
- By Sudheer Published Date - 08:46 PM, Wed - 8 May 24

జగన్ సర్కార్ కౌంట్‌డౌన్ (Countdown of Jagan Govt) మొదలైందన్నారు ప్రధాని మోడీ (PM Modi). అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో నిర్వహించిన బహిరంగ సభ (Pileru Meeting)లో పాల్గొన్న మోడీ..వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అభివృద్ధి అనేది లేకుండా పోయిందని, యువతకు ఉద్యోగాలు లేకుండా చేయడమే కాకుండా.. రైతులను కూడా వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. ప్రజలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. వైసీపీ శాండ్ మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. పేదల వికాసం కోసం కాదు, మాఫియా వికాసం కోసం పని చేసిందని దుయ్యబట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, ఏపీలో మాఫియాకు ఎన్డీఏ ప్రభుత్వం పక్కాగా ట్రీట్ మెంట్ ఇస్తుందని హెచ్చయిర్న్చారు. ఏపీ ప్రజలు వైసీపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తోంది. వైసీపీ మంత్రులు గూండాగిరి చేస్తున్నారు. ఇక్కడ రౌడీ రాజ్యాన్ని నడిపిస్తోందటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అనేక ఖనిజాలు, దేవాలయాలు కలిగిన నేల.. రాయలసీమ అని, చైతన్యవంతులైన యువత ఉన్న ప్రాంతం, రాయలసీమ అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వికాసం మోదీ లక్ష్యం, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని మోదీ తెలుగులో తెలిపారు. నంద్యాల – ఎర్రగుంట్ల రైల్వే లైను పూర్తయిందని, కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతామన్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. టమాటా నిల్వ చేసేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫై కూడా పలు ఆరోపణలు చేసారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ను మళ్లీ తెస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తుందని, అయోధ్య రామమందిర్‌కు తాళం వేస్తుందని, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని మోదీ మండిపడ్డారు. అధికారం కోసం దేశాన్ని విభజించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధపడుతుందన్నారు. భారత్.. విభిన్న జాతుల సమూహం అని చెబుతోంది, కానీ తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read Also : Sam Pitroda : కాంగ్రెస్ చైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా