Amaravati Relaunch : అమరావతి నగరం కాదు.. ఒక శక్తి – ప్రధాని మోడీ
Amaravati Relaunch : “అమరావతి ఒక నగరం కాదు.. అది ఒక శక్తి” అని పేర్కొన్నారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, ఈ ప్రదేశం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైందని తెలిపారు
- By Sudheer Published Date - 05:41 PM, Fri - 2 May 25

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి (Amaravati Relaunch) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హాజరై శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అమరావతి ఒక నగరం కాదు.. అది ఒక శక్తి” అని పేర్కొన్నారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, ఈ ప్రదేశం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైందని తెలిపారు. బౌద్ధ వారసత్వంతో కూడిన ఈ ప్రాంతంలో పునర్నిర్మాణం ప్రారంభమవ్వడం సంతోషకరమని చెప్పారు.
Minister Lokesh : భారత్ వద్ద మోడీ అనే మిసైల్ ఉంది..భారత్ గడ్డపై గడ్డి కూడా పీకలేరు: లోకేశ్
అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దగల శక్తిని కలిగి ఉందని అన్నారు. అమరావతి శంకుస్థాపనలు రాష్ట్ర అభివృద్ధికి, వికసిత్ భారత్ లక్ష్యానికి చిహ్నంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇది స్వర్ణాంధ్ర నిర్మాణానికి శుభారంభమని , నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ వాసి కలలను అమరావతి నెరవేరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తన ప్రసంగంలో ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తన అనుబంధాన్ని గుర్తుచేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని చూసి నేర్చుకున్నానని చెప్పారు. ఇది ఒకరినొకరు అభివృద్ధి దిశగా ప్రేరేపించుకున్న నూతన పాలన మాదిరిగా నిలుస్తుందని అన్నారు. అమరావతిలో కొత్త ఆంధ్రప్రదేశ్‌కు రూపం ఇవ్వడానికి ప్రజలందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. “ఇది కలల రాజధాని మాత్రమే కాదు, అభివృద్ధికి మార్గదర్శక శక్తి” అని ప్రధాని మోదీ స్పష్టంగా ప్రకటించారు.