MLC : AP తలరాతను చెప్పే ఎన్నికలు! CBN బహిరంగ లేఖ!!
నిరుద్యోగం,ఉపాథి,అమరావతి, ఉద్యోగులు ఎమ్మెల్సీ(MLC) ఎన్నికలపై ప్రభావం చూపుతాయని అంచనా.
- By CS Rao Published Date - 05:23 PM, Sat - 11 March 23

నిరుద్యోగం, ఉపాథి, అమరావతి రాజధాని, ఉద్యోగుల వ్యతిరేకత అంశాలు ఏపీ ఎమ్మెల్సీ(MLC) ఎన్నికలపై ప్రభావం చూపుతాయని అంచనా. ఓటర్లుగా (Voters)ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఉన్నారు. వాళ్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటేస్తారని సహజంగా భావిస్తాం. అంతేకాదు, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు ఇవి. ప్రాంతీయ వాదం, నిరుద్యోగం, పరిపాలన మీద జరిగే ఎన్నికలుగా భావించాలి. ఈనెల 13వ తేదీన సెమీ ఫైనల్ గా భావిస్తోన్న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. హోరాహోరీగా జరిగిన ప్రచారం ఈ సాయంత్రం ముగిసింది.
ఏపీ ఎమ్మెల్సీ ప్రచారం ముగిసింది (MLC)
పరిశ్రమలను రాకుండా జగన్మోహన్ రెడ్డి పాలన చేసిందని ఇప్పటి వరకు బలంగా వినిపిస్తోంది. ఫలితంగా నిరుద్యోగం పెరిగింది. ఉపాథి అవకాశాలు లేకపోవడం ఈ ప్రభుత్వంలోని పెద్ద మైనస్ పాయింట్. ఈ సమస్య పూర్తిగా పట్టభద్రులకు(MLC) సంబంధించినది. వాళ్లే ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గాల్లోని ఓటర్లు(Voters). ఇక ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలన లేదు. సీపీఎస్ తో పాటు పలు హామీలను ఉద్యోగ, ఉపాధ్యాయులకు నెరవేర్చలేదు. పైగా ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ జీవో ఇచ్చారు. అంతేకాదు, స్కూల్స్ కు టైమ్ కు రావాలని ఫేస్ రికగ్నైజేషన్ పెట్టారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్, ఉపాధ్యాయుల మధ్య వార్ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడం జరిగింది. ఇక మూడు రాజధానులు ఉండాలని ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసుల వద్దకు గత మూడేళ్లుగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ వెళుతోంది. ఆ రెండు ప్రాంతాల్లోనే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే, ప్రాంతీయ వాదం కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల మీద ఉంటుంది. ఇలా ప్రధాన అంశాలకు క్లారిటీ ఇస్తూ వచ్చే ఫలితాలు సెమీ ఫైనల్ గా భావించాలి.
సర్కార్, ఉపాధ్యాయుల మధ్య వార్
అధికారంలోని వైసీపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని సామదానదండోపాయాలను ఉపయోగిస్తోంది. ప్రధానంగా టీడీపీ ఓటర్లను(Voters) జాబితా నుంచి భారీగా తొలగించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రైవేటు స్కూల్స్ టీచర్లకు కూడా ఓటు హక్కు కల్పించింది. గతంలో ప్రభుత్వం, ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే వాళ్లకు మాత్రమే ఓటు ఉండేది. పట్టభద్రుల స్థానాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ కు మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఇప్పుడు టెన్త్ మార్కులు లిస్ట్ ఉన్నోళ్లను కూడా ఓటర్లగా వైసీపీ మార్చేసింది.ఇలాంటి అక్రమాల నడుమ గెలవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే, ఓటర్లు చదవుకున్నోళ్లు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేయడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాట వేస్తారని టీడీపీ విశ్వసిస్తోంది.
సీబీఎన్ కనెక్ట్` పేరుతో చంద్రబాబు వర్చువల్ భేటీ (Voters)
జనసేన పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ అధికార వైసీపీ మధ్య హోరాహోరీ ప్రచారం జరిగింది. `సీబీఎన్ కనెక్ట్` పేరుతో చంద్రబాబు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో వర్చువల్ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే(Voters) రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసినట్టేనని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ పది వేలు ఇచ్చినప్పటికీ తీసుకుని రాష్ట్రం గురించి ఆలోచించి ఓటేయాలని కోరారు. లేదంటే, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేస్తారని సూచించారు.
Also Read : AP-TS : తెలుగు రాష్ట్రాల్లో సెమీ ఫైనల్! చంద్రబాబు, రేవంత్ గ్రాఫ్ కు `MLC` పరీక్ష!
ఎమ్మెల్యే, గవర్నర్ , స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఎలాగూ వైసీపీకి వెళతాయి. కానీ, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) స్థానాల్లో జరిగే ఎన్నిక పబ్లిక్ మూడ్ ను సూచించనుంది. పైగా ఓటర్లు చదవుకుని ఉద్యోగాలు చేసే వాళ్లు, పట్టభద్రులు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటేస్తారని ఎవరైనా భావిస్తారు. అందుకే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకత ఉందని టీడీపీ చెబుతున్న దానికి ఈ ఎన్నికలు ఒక లిట్మస్ టెస్ట్ గా నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా జరిగిన ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్ల మనోభావాలు
ఏపీలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్థానాలు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడి ప్రజల(Voters) మూడ్ ఆధారంగా గత ఎన్నికల ఫలితాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అమరావతి రాజధాని అంశం కూడా ఈ ఎన్నికల ఫలితాలకు ముడిపడి ఉంది. ఎందుకంటే, రాజధాని అమరావతి ఉండాలని టీడీపీ మొదటి నుంచి చెబుతోంది. ఆ నినాదాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల్ని వైసీపీ రెచ్చగొడుతోంది. ఆ క్రమంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్ల మనోభావాలు ఈ ఎన్నిక ద్వారా బయటపడనుంది.
Also Read : AP Politics : MLC ఎన్నికల్లో ఎవరిదోవ వాళ్లదే! BJPకి JSP కటీఫ్,TDPకి మద్ధతు?
ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) స్థానం (తూర్పు రాయలసీమ), కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (పశ్చిమ రాయలసీమ), శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (ఉత్తరాంధ్ర), ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు జరగనున్నాయి. అంటే, దాదాపు రాష్ట్రం మొత్తం ఎన్నికలకు జరిగినట్టే భావించాలి. రాజధాని ప్రాంతం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఈ ఎన్నికల(Voters) హడావుడి ఉంది.
ఓటర్లకు చంద్రబాబు బహిరంగ లేఖ
సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్(MLC) జరుగుతుంది. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రలోభాలతో వైసీపీ అక్రమ విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు చిరంజీవిరావు (ఉత్తరాంధ్ర), కంచర్ల శ్రీకాంత్ (తూర్పు రాయలసీమ), భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (పశ్చిమ రాయలసీమ)లను అభ్యర్థులుగా కొన్ని నెలల క్రితం చంద్రబాబు ప్రకటించారు. వాళ్లకు ఓటేయడం(Voters) ద్వారా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చెక్ పెట్టాలని కోరారు.
పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్ తో టీడీపీ అవగాహన
ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్ తో టీడీపీ అవగాహన పెట్టుకుంది. రెండో ప్రాధాన్యత ఓటును పీడీఎఫ్ కు వేయాలని నిర్ణయించింది. 2014లో అధికారంలోకి వచ్చాక అనేక సవాళ్లను అధిగమించాం అని చంద్రబాబు వెల్లడించారు. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను అధిగమించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతం సరిగా ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు గుర్తు చేశారు. అందుకే, టీడీపీ అభ్యర్థులకు ఓటేసి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని బహిరంగ లేఖ ద్వారా చంద్రబాబు విజ్ఞప్తి చేయడం పట్టభద్రుల్ని, ఉపాధ్యాయుల్ని ఆలోచింప చేస్తోంది. ఏపీలోని ప్రధాన అంశాలకు గీటురాయిగా నిలిచే ఈ ఎన్నికల్లో ఓటర్లు(Voters) ఇచ్చే తీర్పు సాధారణ ఎన్నికల ఫలితాలను దాదాపుగా తేల్చనుంది.
Also Read : Jagan Twist : విశాఖే రాజధాని వెనుక MLC ఎన్నికల వ్యూహం! డైవర్షన్ పాలిట్రిక్స్ !

Related News

TDP : మైలవరం టీడీపీకి కొత్త అభ్యర్థి.. మాజీ మంత్రికి సీటు లేనట్లేనని అధిష్టానం సంకేతం..?
కృష్ణాజిల్లా టీడీపీకి అన్న తానే అన్నట్లు ఇన్నాళ్లు వ్యవహరించిన మాజీ మంత్రి దేవినేని ఉమాకి అధిష్టానం గట్టి షాక్