AP Poll : వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు
క్యూలైన్ లో రావాలంటూ అభ్యంతరం చెప్పిన ఓటర్‌పై ఎమ్మెల్యే దాడికి తెగపడ్డాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అహంకారంతో అతడి దగ్గరకు వెళ్లి చెంపదెబ్బ కొట్టారు
- By Sudheer Published Date - 01:32 PM, Mon - 13 May 24

ఐదేళ్ల పాటు దాడులు, అరాచకాలతో రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ పార్టీ నేతలు..ఈరోజు పోలింగ్ రోజు కూడా అలాగే దాడులు చేస్తూ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే అనేక చోట్ల టిడిపి శ్రేణులపై దాడులకు పాల్పడిన వైసీపీ నేతలు..పోలింగ్ కేంద్రం లో లైన్ లో రండి అని సదరు ఓటరు..అధికార పార్టీ ఎమ్మెల్యే ను ప్రశ్నించగా..వెంటనే సదరు ఎమ్మెల్యే ఆ ఓటరు ఫై దాడి చేసిన ఘటన ఫై యావత్ ఓటర్లు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం ఐతానగర్ జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
గుంటూరు జిల్లా తెనాలిలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటర్ ఫై దాడికి తెగబడ్డారు. ఐతనగర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయటానికి వచ్చిన ఎమ్మెల్యే క్యూ పద్ధతి పాటించకుండా నేరుగా లోపలికి వెళ్లబోయారు. క్యూలైన్ లో రావాలంటూ అభ్యంతరం చెప్పిన ఓటర్‌పై ఎమ్మెల్యే దాడికి తెగపడ్డాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అహంకారంతో అతడి దగ్గరకు వెళ్లి చెంపదెబ్బ కొట్టారు. వెంటనే ఓటరు కూడా ఎమ్మెల్యే శివకుమార్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరమూక విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓటరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతానగర్ పోలింగ్ బూత్ వద్ద పరిస్థితిని తెలుసుకున్న దీపక్ మిశ్రా సీసీ ఫుటేజ్‌ను తెప్పించాలని ఆదేశించారు. అలాగే ఈ ఘటన ఫై నెటిజన్లు , ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఇలాంటి అధికార నేతలను తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నారు.
Wow, what a stellar display of democracy in action! Tenali #YSRC MLA #Annabathuni #SivaKumar decided to give voters a taste of his leadership style by slapping one at the polling booth. But plot twist: the voter wasn't having any of it and slapped him right back. #ElectionDrama… pic.twitter.com/96BAHTicu5
— dinesh akula (@dineshakula) May 13, 2024
Read Also : KTR – AP Elections : ఏపీ ఎన్నికలపై మనసులో మాట చెప్పేసిన కేటీఆర్