MLA Kapu Ramachandra Reddy Resign : వైసీపీ లో మరో వికెట్ డౌన్
- By Sudheer Published Date - 08:11 PM, Fri - 5 January 24

ఏపీలో ఎన్నికల సమయం (AP Elections) నాటికీ అధికార పార్టీ వైసీపీ (YCP) మొత్తం ఖాళీ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే వరుస పెట్టి ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేసి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీల తీర్థం పుచ్చుకోగా..తాజాగా మరో వికెట్ డౌన్ అయ్యింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (MLA Kapu Ramachandra Reddy ) పార్టీకి రాజీనామా (Resign) చేశారు. టికెట్ లేదు అని తెలిసిన మరుక్షణం ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం.
వైసీపీ అధినేత జగన్ ..ఈసారి అభ్యర్థుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికీ టికెట్ ఇచ్చేది లేదని ముందు నుండి హెచ్చరిస్తూ వస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని..ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచిస్తూ వచ్చారు. కానీ చాలామంది జగన్ సూచనలను పట్టించుకోలేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైంది. వైసీపీ చేయించిన సర్వేల్లో ప్రజలు పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై వ్యతిరేకత కనపరిచారు. వారికీ టికెట్ ఇస్తే ఓటువేసేదే లేదని తేల్చి చెప్పారు. దీంతో జగన్ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యహరిస్తూ వస్తున్నారు. ఎవరెవరికి టికెట్ ఇవ్వడం లేదో ముందే చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురికి చెప్పగా..టికెట్ రానివారు పక్క పార్టీల్లోకి వెళ్తున్నారు. మరికొంతమంది ముందే టికెట్ రాదని గ్రహించి పార్టీ కి రాజీనామా చేస్తున్నారు. రీసెంట్ గా దాడి వీరభద్ర రావు , రామచంద్రయ్య, ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకనాథ రెడ్డి లతో పాటు పలువురు వైసీపీ కీలక నేతలు సైకిల్ ఎక్కేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం వైసీపీ కి రాజీనామా చేసారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే కాపు.. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకు టికెట్ లేదని క్లారిటీ ఇచ్చారు. వెంటనే బయటకు వచ్చి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..సీఎం జగన్ నన్ను నమ్మించి గొంతు కోశారని, నాకు టికెట్ లేదని బయటకు పంపించారని ధ్వజమెత్తారు. జగన్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. తనకు అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. తాను, తన భార్య రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ కోసం కాంగ్రెస్ పార్టీనీ, పదవిని వదులు కొని వచ్చానని .. గతంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు సర్వే పేరుతో టికెట్ లేదని, దరిద్రపు సర్వేలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ఇప్పటి వరకు ఎదురు చూశానని, సజ్జల వచ్చి టికెట్ లేదని చెప్పారని అన్నారు. ఇంత కంటే అవమానం మరొకటి లేదని ఎమ్మెల్యే కాపు వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో అవకాశం వచ్చిన పోటీ చేస్తామని తెలిపారు. వైఎస్ఆర్ తనయుడు నమ్మించి గొంతు కొస్తారని అనుకోలేదని, జగన్ కి గుడ్ బై.. పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.
Read Also : Lakshmi Devi: మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి అని చెప్పే 9 రకాల సంకేతాలు ఇవే?