MP Kesineni Nani : వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్న కేశినేని నాని..?
- By Sudheer Published Date - 12:25 PM, Wed - 10 January 24

టీడీపీ (TDP) పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని (MP Kesineni Nani)..వైసీపీ (YCP) గూటికి చేరేందుకు సిద్దమయ్యారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేతలు తమకు ఏ పార్టీ అనుకూలంగా ఉంటుందో చూసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా వైసీపీ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్తవారికి ఛాన్సులు ఇస్తుండడం తో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ కి గుడ్ బై చెప్పి , టీడీపీ ..జనసేన లలో చేరుతున్నారు. ఇదే విధంగా ఈసారి టీడీపీ ..జనసేన తో పొత్తు పెట్టుకోవడం తో ఈసారి పలువురు నేతలకు టికెట్ విషయంలో నిరాశే ఎదురువుతుంది. అయితే విజయవాడ విషయానికి వస్తే..కేశినేని నాని కి కాకుండా ఈసారి ఆయన తమ్ముడు చిన్నికి టికెట్ ఇవ్వాలని టీడీపీ ఫిక్స్ అయ్యింది. దీంతో నాని..పార్టీ కి రాజీనామా చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో నానితో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. నాని వస్తానంటే పార్టీలోకి ఆహ్వాస్తామని గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు నాని టీడీపీని వీడటంతో వైసీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ది ఎంపిక పైన కసరత్తు చేస్తున్న వైసీపీ.. నాని వస్తే ఆయనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని చూస్తుంది. నాని సైతం వైసీపీ ఆఫర్ కు ఓకే చెప్పేసే విధంగా ఉన్నారు. సంక్రాంతి తరువాత నాని వైసిపిలో చేరనున్నట్టు సమాచారం. మరోపక్క కేశినేని నాని కూతురు శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో 11వ వార్డు టిడిపి కార్పొరేటర్‌గా ఉన్నారు. సోమవారం శ్వేత తన పదవికి రాజీనామా చేసి అనంతరం రాజీనామా పత్రాన్ని మేయర్ భాగ్యలక్ష్మికి ఇచ్చారు. టిడిపి కూడా రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు.
2014, 2019 ఎన్నికల్లో కేశినేని నాని వరుసగా విజయవాడ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. నియోజకవర్గ పరిధిలో తన హయాంలో కేంద్ర నిధులతో పలు కార్యక్రమాలు చేపట్టారు. కొంత కాలంగా టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పార్టీలో నాని కొంత కాలంగా అసౌకర్యంగా ఉంటున్నారు. తాజాగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ చంద్రబాబు తన దూతల ద్వారా సమాచారం ఇచ్చారని.. తాను చంద్రబాబు ఆదేశాల మేరకు దూరంగా ఉంటానని నాని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా ఎంపీ, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also : Gautam Adani : 2 లక్షల కోట్ల పెట్టుబడి పెడతాం.. 1 లక్ష ఉద్యోగాలిస్తాం : అదానీ