Nara Lokesh : శాసనమండలిలో లోకేష్ పిట్టకథ
Nara Lokesh : ఓ నిందితుడిని జడ్జి ముందు తీసుకువెళ్లినప్పుడు అతను తనకు తల్లిదండ్రులు లేరని, అనాధనని వాపోయాడట
- By Sudheer Published Date - 12:51 PM, Wed - 12 March 25

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (Andhra Pradesh Legislative Council)లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు(Payment of fee reimbursement dues)పై వైసీపీ (YCP) సభ్యుల ఆందోళనతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందించాలంటూ వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అయితే మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) దీనిపై స్పందిస్తూ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాత్రమే కాకుండా ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై కూడా చర్చించేందుకు తాము రెడీగా ఉన్నామని తెలిపారు. కానీ,వైసీపీ తీరే అన్వేషణకు గురి చేస్తోందని, అసలు ఏ అంశంపై పోరాటం చేస్తున్నారో వారికే స్పష్టత లేదని విమర్శించారు.
Telangana Assembly : గవర్నర్ ప్రసంగం..కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉంది – కేటీఆర్
ఇదే సందర్భంలో లోకేష్ ఓ కథ చెబుతూ వైసీపీపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఓ నిందితుడిని జడ్జి ముందు తీసుకువెళ్లినప్పుడు అతను తనకు తల్లిదండ్రులు లేరని, అనాధనని వాపోయాడట. కానీ అతనే తన తల్లిదండ్రులను హత్య చేసి అనాధగా మారాడని పోలీసులు చెప్పారని, ఇదే తరహాలో వైసీపీ కూడా తన తప్పిదాలను మరిచి ఇప్పుడు ఆందోళనలు చేస్తోందని లోకేష్ విమర్శించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెంచారని, ఇప్పుడు మళ్లీ వారే ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Walking : వేసవికాలంలో సాయంకాలం వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై తాము స్పష్టమైన వ్యూహం రూపొందించామని, తగిన విధంగా విద్యార్థులకు న్యాయం చేయడానికి ప్రభుత్వానికి కట్టుబడి ఉందని లోకేష్ తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందని, ఇప్పుడు అదే పార్టీ దీని మీద నిరసన తెలిపిన తీరును ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. చివరగా ఈ సమస్యలపై షార్ట్ డిస్కషన్‌కు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, దీనిపై అసెంబ్లీలో అనవసర గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని లోకేష్ స్పష్టం చేశారు.