Telangana Assembly : గవర్నర్ ప్రసంగం..కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉంది – కేటీఆర్
Telangana Assembly : గత 15నెలల పేలవమైన, అట్టర్‌ఫ్లాప్ పరిపాలన గురించి ప్రాయశ్చిత్తం చేసుకునేవిధంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని భావించాం. ఇది గవర్నర్ ప్రసంగం గా కాకుండా గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉంది తప్పా.
- By Sudheer Published Date - 12:38 PM, Wed - 12 March 25

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా గవర్నర్ ప్రసంగం (Governor Jishnu Dev Verma Speech) ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ మీడియా పాయింట్‌లో మీడియా తో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఈ ప్రభుత్వం, ఆరు గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమోనని అనుకున్నామన్నారు. గత 15నెలల పేలవమైన, అట్టర్‌ఫ్లాప్ పరిపాలన గురించి ప్రాయశ్చిత్తం చేసుకునేవిధంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని భావించాం. ఇది గవర్నర్ ప్రసంగం గా కాకుండా గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉంది తప్పా.. గవర్నర్ ప్రసంగంలా లేదు. గవర్నర్ నోటి వెంట ఒకటికాదు రెండు కాదు చాలా అబద్ధాలు చెప్పించారు. గవర్నర్ నోటివెంట అసత్యాలు పలకాల్సి రావడంపై బాధపడుతున్నాం. కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యం వల్ల ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది’ కేటీఆర్ తెలిపారు.
Telangana Assembly : తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ : గవర్నర్ జిష్ణుదేవ్
‘రాష్ట్రంలో ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నయ్. ఇప్పటికే 480 పైచీలుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం ఒక మాట రైతులకు స్వాంతన చేకూర్చే, ఉపశమనం, భరోసా ఇచ్చేమాట గవర్నర్ నోటినుంచి వస్తుందేమోననని ఆశించాం. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం. పంటలకు నీరు ఇస్తాం. బుద్ధి తెచ్చుకున్నాం. ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాట చెబుతారని అనుకున్నాం. వారి నోటివెంట ఒక్క మాట రాలేదు. అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25శాతం నుంచి 30శాతానికి మించి రుణమాఫీ జరుగలేదు. దీనిపై పోయిన శాసనసభలో ప్రభుత్వాన్ని అడిగినం. సీఎం సొంత ఊరికి పోదామా? సొంత నియోజకర్గానికి పోదామా? ప్లేస్, సమయం మీ ఇష్టం.. ఊరు మీష్టం అని చెప్పాం. ఒక ఊరిలో వందశాతం రుణమాఫీ జరిగితే మేం అందరం రాజీనామా చేస్తామని చెప్పాం. కానీ మళ్లీ ఈ రోజు గవర్నర్ నోటివెంట రుణమాఫీ అయిపోయింది.. లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నరని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించి.. గవర్నర్ స్థాయిని సైతం దిగజార్చి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం తన భ్రష్టత్వాన్ని, నీచత్వాన్ని బయటపెట్టుకుంది’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
God Is Real : దేవుడు ఉన్నాడు.. గణిత ఫార్ములాతో నిరూపిస్తా.. శాస్త్రవేత్త విల్లీ సూన్