HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Lokeshs U S Tour A Grand Success Key Companies Coming Soon To Ap

Nara Lokesh America Tour: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన గ్రాండ్ సక్సెస్.. త్వరలోనే ఏపీకి పలు కీలక కంపెనీలు!

అమెరికాలో మంత్రి లోకేష్ బిజీగా గడిపారు, దిగ్గజ కంపెనీలతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలపై పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ఈ చర్చల వల్ల ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ముందుకు రాబోతున్నట్లు సమాచారం ఉంది, తద్వారా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

  • Author : Vamsi Chowdary Korata Date : 02-11-2024 - 11:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh America Tour
Nara Lokesh America Tour

రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. గత వారం రోజుల పాటు నిర్వహించిన ఈ పర్యటనలో, ఆయన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా 100కి పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని నేరుగా పెంచడంలో మంత్రి నారా లోకేష్ విజయం సాధించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) విజన్‌ను కూడా ఆయన ప్రదర్శించారు.

ఐదేళ్ల విధ్వంసక పాలనలో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం లక్ష్యంగా మంత్రి లోకేష్ టూర్ కొనసాగింది. ఆయన ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. ఈ భేటీల నేపథ్యంలో జనవరిలో దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సులో భారీ ఒప్పందాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. లోకేష్ పర్యటన విజయవంతంగా ముగిసినందుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికాలో లోకేష్ బిజీబిజీగా గడిపారు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ఈ క్రమంలో, ఏపీకి పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు సమాచారం. కంపెనీలు వచ్చినట్లయితే, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చు. జగన్ హయాంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోతే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. నవ్యాంధ్రకు పెట్టుబడులను తీసుకురావడం లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ అమెరికా పర్యటన చేపట్టారు. ప్రముఖ దిగ్గజ కంపెనీల అధిపతులతో విస్తృతంగా చర్చలు జరిపారు.

ఏపీలో పెట్టుబడులకు అవకాశాలపై లోకేష్ వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుద్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్ కార్లు, మరియు రియల్‌ఎస్టేట్ రంగాలలో ప్రముఖులతో సంప్రదింపులు నిర్వహించారు. అమరావతి, ఉత్తరాంధ్ర, గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే విధంగా ఆయా రంగాల్లో అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆయన పర్యటనలో సీఎంవో సంయుక్త కార్యదర్శి కార్తికేయ మిశ్రా కూడా పాల్గొన్నారు.

గత నెల 25వ తేదీన హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన లోకేష్, మర్నాటి నుంచి వారం రోజుల పాటు అనేక సంస్థల సీఈవోలు, అధినేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో తన పర్యటనను ముగించుకొని, ఈరోజు (శనివారం) భారత కాలమానం ప్రకారం స్వదేశానికి బయలుదేరతారు. ఆదివారం హైదరాబాద్ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలియజేశాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Investments
  • Nara Chandrababu Naidu
  • nara lokesh
  • Nara Lokesh In USA
  • Nara Lokesh US Tour

Related News

Mahandu 2026

Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మహానాడు-2026 ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులు, కార్యకర్తలు పె

    Latest News

    • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

    • NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

    • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

    • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

    • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd