HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Lokesh Press Meet At Vizag

Defamation case : నిజం నా వైపు ఉంది.. ఎన్నిసార్లు పిలిచినా వ‌స్తా : లోకేశ్‌

పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఇప్ప‌టికి నాలుగుసార్లు హాజరయ్యాన‌ని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతాన‌న్నారు.

  • Author : Latha Suma Date : 27-01-2025 - 1:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister-lokesh-press-meet-at-vizag
Minister-lokesh-press-meet-at-vizag

Defamation case : 2019లో సాక్షి పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖలో కోర్టుకు వెళ్లారు. ఈ మేరకు ఆయన మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 సాక్షి తనపై ఒక కథనం రాసిందని.. తాను గతంలో మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం తన కోసం సుమారు రూ. 25 లక్షలు ఖర్చు చేసిందని వార్త రాసిందని.. దీనికి సంబంధించి అప్పుడు తాను ఆధారాలు చూపించాలంటూ సాక్షిపై లీగల్ నోటీసు జారీ చేశానని లోకేష్ తెలిపారు.

ఇవాళ కూడా మంత్రి హోదాలో విశాఖకు వచ్చినా పార్టీ ఆఫీసులో బస్సులో నిద్రించిన‌ట్లు తెలిపారు. అక్కడ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేద‌న్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజాయిండర్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశామ‌ని చెప్పారు. పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఇప్ప‌టికి నాలుగుసార్లు హాజరయ్యాన‌ని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతాన‌న్నారు. నిజం త‌న‌వైపు ఉంద‌ని, ఎప్ప‌టికైనా అది గెలుస్తుందని నమ్ముతున్నట్లు లోకేశ్ చెప్పారు.

జగన్‌పై తల్లి, చెల్లికే నమ్మకం లేదు.. ఇక నాయకులకేం ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వ అవినీతి కేసులపై వెంటనే విచారణ జరపడం కుదరదని, ఒక్కొక్కటిగా అన్నీ చేస్తామని, వేచి చూడాలని అన్నారు. తప్పు చేసినవారిని ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌కు ఏ బాధ్య‌త అప్ప‌గించినా అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ‌తాన‌ని అన్నారు. త‌నవ‌ల్ల‌ పార్టీకి ఏనాడూ చెడ్డ‌పేరు రాకుండా చూసుకుంటాన‌ని తెలిపారు. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూడదని అన్నారు. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలనేది తన అభిప్రాయమని అన్నారు. మూడు పర్యాయాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని.. ఈసారి ఆ పదవిలో ఉండకూడదనుకుంటున్నానని మంత్రి లోకేష్ వెల్లడించారు.

Read Also: Hari Hara Veera Mallu : మేకర్స్‌ ఇలా చేశారేంటీ… గందరగోళంలో పవన్‌ ఫ్యాన్స్‌..!

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • defamation case
  • jagan
  • Minister Lokesh
  • tdp
  • Visakhapatnam Court

Related News

Midhun Reddy

Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మహిళల భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉండటం నేరస్తులను ప్రోత్సహించినట్లే అవుతుందని మిథున్ రెడ్డి హెచ్చరించారు

  • Jagan Lotus Pond

    YCP Jagan : మళ్లీ లోటస్‌పాండ్ కు జగన్ మకాం ?

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

Latest News

  • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

  • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

  • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

  • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

  • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd