Somireddy vs Kakani : వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డికి డిపాజిట్ దక్కదన్న మంత్రి కాకాణి
2024లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి డిపాజిట్ గల్లంతు
- Author : Prasad
Date : 09-10-2023 - 7:07 IST
Published By : Hashtagu Telugu Desk
2024లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి డిపాజిట్ గల్లంతు అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి జోస్యం చెప్పారు. తనపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. సోమిరెడ్డి మాటలు ప్రజలు నమ్మరని, మాజీ మంత్రి అబద్ధాల కోరు అని తమకు తెలుసునని అన్నారు. సోమిరెడ్డి తనపై నాలుగుసార్లు ఓడిపోయినా తన వైఖరి మార్చుకోలేదని కాకాణి అన్నారు. టీడీపీ నేతలు చేస్తున్నా ఆందోళన ప్రజల దృష్టిని మరల్చడమేనని తెలిపారు. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళ్లారని మంత్రి కాకాణి తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రమేయంపై ప్రభుత్వం వద్ద డాక్యుమెంటరీ సాక్ష్యాలు ఉన్నందున చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం చాలా కష్టమని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన తండ్రి ప్రమేయం ఉందని నారా లోకేష్‌కు తెలిసినా, ఆయన ఢిల్లీలో ఉండి తన తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని కాకాణి తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌పై గుట్టు చప్పుడు కాకుండా బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని టీడీపీ నేతలకు హితవు పలికారు
Also Read: Inner Ring Road case : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరికొంతమందికి షాక్ ఇచ్చిన సీఐడీ