Perni Nani : హాఫ్ నాలెడ్జ్ మాటలు మానుకోవాలి – పేర్ని నాని కి మంత్రి దుర్గేశ్ వార్నింగ్
Perni Nani : ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ, నిర్మాతల అభ్యర్థన మేరకు టికెట్ల ధరలు పెంచిన దాఖలాలు ఉన్నాయని వివరించారు
- By Sudheer Published Date - 01:36 PM, Mon - 26 May 25

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తీవ్రంగా స్పందించారు. సినీరంగం(Film Industry)పై పూర్తి అవగాహన లేకుండా హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సినిమాల విషయమై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, అవి సినిమారంగానికి దెబ్బతీయాలని చేసిన ప్రయత్నంలా ఉన్నాయని దుర్గేశ్ మండిపడ్డారు. సినీ పరిశ్రమను ప్రభుత్వం ఇబ్బందిపెట్టుతోందనే దుష్ప్రచారాలు కొందరు కావాలని చేస్తున్నారు అని ఆరోపించారు.
Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత.. గుంటూరు జీజీహెచ్ కి తరలింపు..
చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బందులు కలుగకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ముందుండే తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ, నిర్మాతల అభ్యర్థన మేరకు టికెట్ల ధరలు పెంచిన దాఖలాలు ఉన్నాయని వివరించారు. సినిమా రంగం పూర్తిగా ప్రైవేట్ రంగంగా ఉన్నప్పటికీ, గత ప్రభుత్వమే నియంత్రణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ కావడానికే ముందే వివాదాలు సృష్టిస్తున్న వారిని మంత్రి దుర్గేశ్ తీవ్రంగా విమర్శించారు. హరిహర వీరమల్లు విడుదల కాకముందే ఫ్లాప్ అని అభిప్రాయపడటం అనవసరమని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలపై కేవలం విచారణ జరిపే సూచన మాత్రమే ఇచ్చామని, సినీరంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అంకితభావంతో ఉన్నదని మరోసారి గుర్తు చేశారు.