Anganwadi Workers Protest : ప్రతిసారీ అంగన్వాడీ జీతాలు పెంచుతామని తాము చెప్పలేదు – మంత్రి బొత్స
- Author : Sudheer
Date : 29-12-2023 - 9:24 IST
Published By : Hashtagu Telugu Desk
గత కొద్దీ రోజులుగా ఏపీలో అంగన్వాడీలు (AP Anganwadi Workers) తమ డిమాండ్స్ ను ప్రభుత్వం నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. పలుమార్లు మంత్రులతో సమావేశాలు జరిపినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. దీంతో రోజు రోజుకు తమ ఆందోళలనలు ఉదృతం చేస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa React ) అంగన్వాడీలు ఆందోళలనపై స్పందించారు.
We’re now on WhatsApp. Click to Join.
అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని..ఎన్నికల ప్రచారంలో వారికీ ఇచ్చిన హామీ ప్రకారం.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 పెంచమని తెలిపారు. మొదటి ఏడాది రూ.11 వేలు చేసినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు అంగన్వాడీలతో చర్చలు జరిపామని, వారి 10 డిమాండ్లకు అంగీకరించామని … ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జీతాలు పెంచే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తోందని, పరిస్థితి అర్థం చేసుకొని, సమ్మె విరమించాలని బొత్స కోరారు.
ఇదే క్రమంలో డీఎస్సీ (DSC ఫై ఓ క్లారిటీ ఇచ్చారు. రెండు , మూడు రోజుల్లో డీఎస్సీ ఫై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Read Also : Choreographer Johnny : నెల్లూరు జనసేన అభ్యర్థిగా జానీ మాస్టర్..?