Minister Amarnath : అవినీతిపై చర్చకు సీఎం జగన్‌ను లోకేష్ పిలవడం పెద్ద జోక్ : మంత్రి అమర్‌నాథ్
అవినీతిపై చర్చకు సీఎంను లోకేష్ పిలవడం హాస్యాస్పదమని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా
- By Prasad Published Date - 09:06 AM, Sun - 17 September 23

అవినీతిపై చర్చకు సీఎంను లోకేష్ పిలవడం హాస్యాస్పదమని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అవినీతిపై చర్చకు ఇటీవల ఓ టీవీ ఛానెల్ డిబెట్‌లో పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి తన తండ్రి చంద్రబాబు నాయుడుకు సంబంధం లేదని లోకేష్ ఎందుకు చెప్పడం లేదని మంత్రి అమర్‌నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చేసరికి కేవలం రెండెకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉందని.. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 683 కోట్లుగా ఉన్నాయన్నారు. దేశంలోని 4 వేల మంది ఎమ్మెల్యేలలో చంద్రబాబు నాయుడు నాలుగో ధనిక ఎమ్మెల్యే అని ఓ ఆంగ్ల దినపత్రిక పేర్కొందని తెలిపారు. 553 కోట్లతో స్కిల్ డెవలపింగ్ సెంటర్ నెలకొల్పినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అమర్‌నాథ్ సవాల్ విసిరారు. చంద్రబాబు కోసం పక్క రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో చేసే ధర్నాల్నీ ఆయన మనుషులే చేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినందుకు నిరసనగా సామాన్యులెవరూ రోడ్డుపైకి రాలేదన్నారు.