HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Midnight Arrests During The Reign Of Darkness

Midnight Arrests: చీకటి పాలనలో అర్ధరాత్రి అరెస్టులు..!

ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు (Arrests)తో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కి చంద్రబాబు నంద్యాలలో క్యాంప్ చేసి ఉన్నారు.

  • By Hashtag U Published Date - 10:41 AM, Sat - 9 September 23
  • daily-hunt
Arrests
Chandrababu came out of the bus

By: డా.ప్రసాదమూర్తి

Midnight Arrests: ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు (Arrests)తో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కి చంద్రబాబు నంద్యాలలో క్యాంప్ చేసి ఉన్నారు. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతుందని పలు వార్తలు నిన్నటి నుంచి ఊపందుకున్నాయి. కారణాలు మాత్రం రకరకాలుగా వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలు, ఊహాగానాలు నిజమేనని చంద్రబాబుని శనివారం తెల్లవారుజామున అరెస్టు చేయించి అధికార వైసిపి నేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుజువు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లో పెద్ద కుంభకోణం జరిగిందని, వేలకోట్ల లావాదేవీలు జరిగాయని, డిజైన్ టెక్ కంపెనీ లాంటి అనేక షెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున ధనం తరలింపు జరిగిందని, చంద్రబాబు మీద ఆరోపిస్తున్నారు.

ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు, ప్రతిదూషణలు, విమర్శలు, ప్రతివిమర్శలు రాజకీయాలలో సాధారణమే. అధికారంలో ఉన్నవారు అధికారాన్ని కాపాడుకోవడానికి, ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలోకి రావడానికి ఎవరి రాజకీయాలు వారు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని రకాల హక్కులూ ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నైతిక విలువలను దృష్టిలో ఉంచుకొని, రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించడమే వారి వారి వ్యక్తిత్వాలకు నిదర్శనం అవుతుంది.

అయితే చీకట్లో, 70 సంవత్సరాలు పైబడిన ఒక వృద్ధ ప్రతిపక్ష నేత దగ్గరకు వెళ్లడం, ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అరెస్టు చేయడం అధికారంలో ఉన్న నాయకులకు సముచితమే అనిపించవచ్చు. కాని అదంతా కళ్లారా చూస్తున్న ప్రపంచానికి మాత్రం సంపూర్ణంగా అనైతిక అనుచిత ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగానే కనిపిస్తుంది. అరెస్టు చేసిన టైమింగ్ కీలకం. కుంభకోణం జరిగితే దానిమీద ఏం విచారణ జరిగింది, ఏ వాదోపవాదాలు జరిగాయి. ఏ ఆధారాల మీద దర్యాప్తులు సాగించారు, కేసు కొనసాగిన విధివిధానాలు ఏమిటి అనే విషయాలు ఆలోచనకు వస్తాయి. ఏ విచారణలు కొనసాగినా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా నిద్రలో లేపి బేడీలు వేసి పట్టుకుపోవడం ఏమాత్రం సమర్ధనీయం కాదని చంద్రబాబు న్యాయవాదులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వాదిస్తున్నారు. ప్రజాస్వామిక విలువల పట్ల నమ్మకం ఉన్నవారు జగన్మోహన్ చేసిన ఈ పని నియంతృత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Chandrababu: 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాను: చంద్రబాబు

తెల్లవారితే శనివారం సెకండ్ సాటర్ డే. ఆ తరువాత ఆదివారం. రెండు రోజులు కోర్టులు ఉండవు. మేజిస్ట్రేట్ ముందు హాజరపరచడానికి జడ్జి గారు కూడా అందుబాటులో లేరని చెబుతున్నారు. అంటే కనీసం రెండు రోజులైనా చంద్రబాబును పోలీసుల కస్టడీలో ఉంచి తమ కక్ష తీర్చుకోవాలని అధికార పార్టీ ఆత్రపడుతున్నట్టుగా కనిపిస్తోంది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవజ్ఞుడు, 70 సంవత్సరాలు పైబడిన నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుని, చూడండి.. మేము కాబట్టి బందీ చేశాం అని అధికార పార్టీ చంకలు గుద్దుకోవచ్చు. ఇది ఆ పార్టీ అల్ప రాజకీయాలకు, చౌకబారు ధోరణికి అర్థం పడుతుంది. కానీ చుట్టూ ఇదంతా గమనిస్తున్న ప్రజలకు దీని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలు మాత్రం తప్పనిసరిగా బోధపడతాయి.

అధికారంలోకి వచ్చింది మొదలు ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆయన అనుచర గణం అందరూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద దాడులు చేయడానికి ఎలాంటి చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. రాజకీయంగా దాడులు చేయడం వేరు భౌతికమైన దాడులు వేరు. అరెస్టులు, గృహ నిర్బంధాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు నిత్యకృత్యాలుగా మారిపోయాయి. జనం ఖాతాల్లో డబ్బులు వేయడం తప్ప ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఏ రంగంలోనూ ఒక్క అడుగు ముందుకైనా పడలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పోలవరం విషయం గాని రాజధాని విషయం గాని ఏపీ ప్రత్యేక హోదా విషయం గానీ ఇలా అనేకానేక కీలక సమస్యలు పరిష్కారం కాలేదు. రోడ్లు వేయడం దగ్గర నుంచి రాజధాని నిర్మాణం దాకా ఏ చిన్న పనీ జరగలేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నిష్ఫల పరిపాలనను తీవ్రంగా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న రోడ్ షోలు, నిర్వహిస్తున్న బహిరంగ సభలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ఒకపక్క న్యాయస్థానాల నుంచి కూడా జగన్ సర్కారుకు ఏ విషయంలోనూ ఆమోదముద్ర లభించడం లేదు. కనుకనే జగన్ ఒక రకమైన పొలిటికల్ డిప్రెషన్ కి గురై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అర్ధరాత్రి అరెస్టు కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న చీకటి పాలనకు చంద్రబాబు అర్ధరాత్రి అరెస్టు అద్దం పడుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • Arrests
  • Chandrababu Arrest
  • cm jagan
  • Midnight Arrests
  • tdp
  • ysrcp

Related News

Nara Lokesh Google Vizag

Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ ప

    Latest News

    • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

    • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

    • Tata Nexon: బంప‌రాఫ‌ర్‌.. ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు త‌గ్గింపు!

    • IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd