HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Massive Reshuffle Of Ias Officers In Andhra Pradesh

IAS Officers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. 8 జిల్లాల కొత్త కలెక్టర్లు వీరే.. !

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారుల (IAS Officers)ను బదిలీ చేసింది.

  • Author : Gopi Date : 07-04-2023 - 8:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan RRR dispute
Jagan Ap Govt

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారుల (IAS Officers)ను బదిలీ చేసింది. 8 జిల్లాల కలెక్టర్లు సహా 57 మందికి స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు (జీవో 635) జారీ చేశారు. ఒకేసారి ఇంత మంది అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.

ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 57 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరికి పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ శాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌, ఎస్సీ కమిషన్‌ కార్యదర్శిగా హర్షవర్ధన్‌, కార్మికశాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు, కార్మికశాఖ కార్యదర్శిగా హరిజవహర్‌లాల్‌, జెన్‌కో ఎండీగా చక్రధర్‌బాబు, పురపాలక డైరెక్టర్‌గా కోటేశ్వరరావు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా సూర్యకుమారి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు, నెల్లూరు అనంతపురం, విజయనగరం, బాపట్ల, కర్నూలు, కృష్ణ, సత్యసాయి జిల్లాలకు కొత్త కలెక్టర్ నియామించారు.

Also Read: LSG vs SRH: తొలి విజయం కోసం హైదరాబాద్.. రెండో విజయం కోసం లక్నో.. గెలుపెవరిదో..?

ఏపీలో 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు కలెక్టర్‌గా ఎం.హరినారాయణ్, విజయనగరం కలెక్టర్‌గా నాగలక్ష్మి, చిత్తూరు కలెక్టర్‌గా షన్మోహన్, కర్నూలు కలెక్టర్‌గా సృజన, బాపట్ల కలెక్టర్‌గా రంజిత్ బాషా, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రాజబాబు, సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.అరుణ్‌బాబు, అనంతపురం కలెక్టర్‌గా ఎం. గౌతమిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cm jagan
  • IAS Officers
  • IAS Transfers

Related News

Key Meeting with Union Minister C.R. Patil Chandrababu

Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల లోపు పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిం

  • IT Minister Nara Lokesh Receives Grand Welcome At Singapore

    Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

  • CM Chandrababu Naidu

    CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

  • Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd