JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత మరో ఫిర్యాదు.. ఆరోపణలివీ
ఈ ఘటన వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ఆరోపించారు.
- By Pasha Published Date - 09:55 AM, Sat - 15 February 25

JC Prabhakar Reddy : టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఇవాళ (శనివారం) సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 సంవత్సరం డిసెంబరు 31న తాడిపత్రిలో జరిగిన గర్ల్స్ ఈవెంట్ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవీలత మధ్య వివాదం రాచుకుంది. ఆ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు బెదిరింపు కాల్స్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాధవీ లత పేర్కొన్నారు. చట్టప్రకారం జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read :Rent A Boyfriend : బిర్యానీ రేటుకే అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. పోస్టర్లు వైరల్.. నెటిజన్ల ఆగ్రహం
జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పినా..
మహిళల కోసం 2024 సంవత్సరం డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకల ప్రత్యేక ఈవెంట్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని మాధవీలత తప్పుపట్టారు. ‘‘ఈ వేడుకలకు మహిళలు ఎవరూ వెళ్లొద్దు. ఆ కార్యక్రమానికి వెళ్తే మహిళల రక్షణకు ఇబ్బందులు వస్తాయి’’ అని మాధవీ లత అప్పట్లో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీంతో ఆమెపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత కామెంట్స్ చేశారు. దీంతో జేసీ ట్రావెల్స్‌కు చెందిన ఒక బస్సు దగ్ధమైంది. ఈ ఘటన వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కూడా చెప్పారు. ఆవేశంలో అలా మాట్లాడానని, తాను చేసింది తప్పేనని ఆయన ఒప్పుకున్నారు. అయినా కొన్ని రోజుల క్రితమే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు, హెచ్‌ఆర్సీకి మాధవీలత ఫిర్యాదులు ఇచ్చారు.