HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mad Man Ruling Andhra Pradesh Nara Lokesh Slams Cm Jagan

Lokesh vs Jagan: పిచ్చోడి చేతిలో ఆంధ్రప్రదేశ్

స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ, అధికార పార్టీ వైసీపీ ల మధ్య వివాదం ముదురుతోంది. ఈ ఇష్యూలో చంద్రబాబు అరెస్ట్ అయి 24రోజులు అవుతుంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 03-10-2023 - 2:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Vs Jagan
Lokesh Vs Jagan

Lokesh vs Jagan: స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ, అధికార పార్టీ వైసీపీ ల మధ్య వివాదం ముదురుతోంది. ఈ ఇష్యూలో చంద్రబాబు అరెస్ట్ అయి 24రోజులు అవుతుంది. ఇక నారా లోకేష్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. స్కిల్ స్కాములో చంద్రబాబును ముద్దాయిగా చేర్చగా, ఇన్నర్ రింగ్ రోడ్డులో నారా లోకేష్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ నోటీసులు ఇచ్చింది. దీంతో నారా లోకేశ్ అక్టోబర్ 4వ తేదీ అంటే రేపు బుధవారం ఆంధ్రప్రదేశ్ లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇది రాజకీయ కక్షపూరిత చర్యగా భావిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో నారా లోకేష్, పార్టీ మద్దతుదారులు సోమవారం నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడును విడుదల చేయాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ‘ఐ యామ్ విత్ సీబీఎన్’ పోస్టర్లు పట్టుకుని సంఘీభావం తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ కు ఒక పిచ్చివాడు సిఎం అయ్యాడని హాట్ కామెంట్స్ చేశాడు లోకేష్. రాజకీయ నిబద్ధత కలిగిన చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. ఇది ముమ్మాటికీ రాజకీయ పోకడే తప్ప మరొకటి కాదన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ లభించినా మరో రెండు కేసులలో అతన్ని మళ్లీ రిమాండ్‌లో ఉంచవచ్చుని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనపై కూడా తప్పుడు కేసులు పెడుతుందని, తన భార్యను, తల్లిని కూడా జైల్లో పెడతానని బెదిరింపులకు గురిచేస్తోందన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పిచ్చి పరిపాలన సాగుతోంది అని నారా లోకేశ్‌ మండిపడ్డారు.స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ( CID) సెప్టెంబర్ 9న అరెస్టు చేసింది.

Also Read: BMW X2 SUV: బీఎండ‌బ్ల్యూ నుంచి మరో అదిరిపోయే కారు.. ఫీచర్లు ఇవే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • chandrababu
  • CID
  • cm jagan
  • Inner Ring Road Case
  • nara lokesh
  • Skill Development Case

Related News

CM Chandrababu Naidu

CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి (ఈ నెల 11న) ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షిం

  • Nara Lokesh

    AP ECET 2026 results: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల : నారా లోకేశ్

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd